కోడెలపై ఈసీ చర్యలు తీసుకోవాలి: అంబటి - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » కోడెలపై ఈసీ చర్యలు తీసుకోవాలి: అంబటి

కోడెలపై ఈసీ చర్యలు తీసుకోవాలి: అంబటి

Written By news on Wednesday, June 22, 2016 | 6/22/2016


కోడెలపై ఈసీ చర్యలు తీసుకోవాలి: అంబటి
హైదరాబాద్: ఎన్నికల నియామవళిని ఉల్లంఘించినందుకు  గుంటూరు జిల్లా సత్తెనపల్లి శాసనసభ్యుడు, ఏపీ శాసనసభ స్పీకర్ కోడెల శివప్రసాదరావుపై ఎన్నికల కమిషన్ చర్యలు తీసుకోవాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు కోరారు. ఆయన మంగళవారం పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. 'ఎన్నికల్లో రూ.11.50 కోట్లు ఖర్చు పెట్టానని కోడెల ఒప్పుకున్నారు. ఆయన చట్టప్రకారం ఎమ్మెల్యేగా కొనసాగే అర్హత లేదు. కోడెల వ్యాఖ్యలను ఎన్నికల కమిషన్ సుమెటోగా స్వీకరించి చర్యలు తీసుకోవాలి.
ఆయన వ్యాఖ్యలపై మేం ఈసీకి రాతపూర్వకంగా ఫిర్యాదు చేస్తాం. దీనిపై న్యాయ నిపుణులతో చర్చిస్తున్నాం. గతంలో ఇలాంటి వ్యాఖ్యలు చేసినవారిపై ఎన్నికల సంఘం చర్యలు తీసుకుంది. ఈసీ చర్యలు తీసుకోకముందే నైతిక బాధ్యతగా కోడెల శివప్రసాదరావు రాజీనామా చేయాలి. నేరం ఆయనే బహిరంగంగా అంగీకరించారు. రూ.11 కోట్లు ఖర్చు పెట్టామని రూ.1100 కోట్లు సంపాదనే లక్ష్యంగా కోడెల వ్యవహరిస్తున్నారు. సత్తెనపల్లి, నర్సరావుపేట నియోజకవర్గాల్లో కోడెల కుమారుడు, కుమార్తె విచ్చలవిడిగా అవినీతికి పాల్పడుతున్నారు.
గిన్నీస్‌ బుక్కులో నమోదైనట్లుగా చెప్పుకుంటున్న మరుగుదొడ్లలో కూడా కమిషన్లు తీసుకున్న నీచమైన స్థాయికి దిగజారారు. శ్మశానాల నిర్మాణంలో కూడా కమిషన్లు తీసుకుంటున్నారు. శవాలపై బొగ్గులు ఏరుకున్నట్లుందని సినిమాల్లో డైలాగులున్నాయని, ఇపుడు శ్మశానాల్లో కూడా కమిషన్లు కాజేసే వాళ్లు బయలుదేరారు. రిజిస్ట్రేషన్ శాఖ, పోలీసు శాఖల్లో కూడా కమిషన్లు తీసుకుంటున్నారు. కోడెల కుమారుడైతే సివిల్, భూ తగాదాల్లో జోక్యం చేసుకుని పోలీసు బలగాలతో ఓ వర్గం కొమ్ముకాస్తూ కోట్లాది రూపాయలు ఖరీదు చేసే భూములను కాజేస్తున్నారు.' అని అంబటి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.

కాగా గత ఎన్నికల్లో రూ.11.50 కోట్లు ఖర్చు చేశానని  కోడెల శివప్రసాదరావు సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే.  కోడెల ఒక టీవీ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో విలేకరి అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్తూ ‘నేను మొదట రాజకీయాల్లోకి వచ్చి 1983 ఎన్నికల్లో పోటీ చేసినపుడు రూ. 30 వేలు ఖర్చయ్యింది. ఆ 30 వేలల్లో కూడా గ్రామాలు, ప్రజల నుంచి చందాలు వచ్చాయి. అలాంటిది మొన్నటి ఎన్నికల్లో రూ.11.50 కోట్లు ఖర్చయ్యింది' అని తెలిపారు.
Share this article :

0 comments: