తండ్రి అనకొండ, కొడుకు కొండచిలువ: రోజా - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » తండ్రి అనకొండ, కొడుకు కొండచిలువ: రోజా

తండ్రి అనకొండ, కొడుకు కొండచిలువ: రోజా

Written By news on Tuesday, June 7, 2016 | 6/07/2016


తండ్రి అనకొండ, కొడుకు కొండచిలువ: రోజా
హైదరాబాద్ : ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఆమె మంగళవారం పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ అధికారంలోకి వచ్చి రెండేళ్లు అవుతున్నా చంద్రబాబు చేసింది ఏమీ లేదన్నారు. అవినీతి అనకొండ అంటే చంద్రబాబే అని రోజా వ్యాఖ్యానించారు. ఇక కమిషన్ల కొండచిలువ అంటే లోకేశ్ బాబేనని అన్నారు. చంద్రబాబు, లోకేశ్ గుడి, గుడిలోని లింగాన్ని మింగేస్తున్నారన్నారు. చంద్రబాబు ఫైళ్లపై సంతకాలు చేస్తుంటే.. లోకేశ్ సూట్ కేసులు సర్ధుతున్నారన్నారు.

సినిమాల్లో కలెక్షన్ కింగ్ మోహన్ బాబు అయితే రాజకీయాల్లో మాత్రం కలెక్షన్ కింగ్ మాత్రం లోకేశ్ అని రోజా విమర్శించారు. తాగండి, పేకాట ఆడండి, చెక్క భజనలు చేయండంటూ చంద్రబాబు అంటున్నారని ఆమె మండిపడ్డడారు. రానున్న రోజుల్లో చంద్రన్న పేకలు, చంద్రన్న పెగ్గులు, చంద్రన్న చెక్కలు అనే కొత్త పథకాలు పెట్టేలా ఉన్నారని రోజా ఎద్దేవా చేశారు.
చంద్రబాబు మానసిక స్థితి బాగోలేదని, ఆయనను మెంట్ ఆస్పత్రిలో చేర్చాలన్నారు. అవినీతిలో చంద్రబాబుకు ఉన్నంత అనుభవం ఎవరికీ లేదన్నారు. నవ నిర్మాణ దీక్ష పేరుతో సంబరాలు చేసుకోవడం సిగ్గుచేటు అన్నారు. రాష్ట్రాన్ని సర్వ నాశనం చేసిన తండ్రీకొడుకులు ఉత్సవాలు చేసుకుంటున్నారని మండిపడ్డారు. మహిళల సమస్యలు పరిష్కరించకపోతే చంద్రబాబుకు చీపురు దెబ్బలు తప్పవని రోజా హెచ్చరించారు. ఇక మహిళల రక్షణ కోసం చంద్రబాబు చేసిందేమీ లేదన్నారు.
Share this article :

0 comments: