నేడు విజయవాడలో వైఎస్సార్‌సీపీ విస్తృతస్థాయి సమావేశం - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » నేడు విజయవాడలో వైఎస్సార్‌సీపీ విస్తృతస్థాయి సమావేశం

నేడు విజయవాడలో వైఎస్సార్‌సీపీ విస్తృతస్థాయి సమావేశం

Written By news on Tuesday, June 14, 2016 | 6/14/2016


నిరంకుశ పాలనపై పోరుబాట
- నేడు విజయవాడలో వైఎస్సార్‌సీపీ విస్తృతస్థాయి సమావేశం
సీఎం చంద్రబాబు వైఫల్యాలపై ప్రధాన చర్చ

 సాక్షి, హైదరాబాద్:ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అవినీతి, నిరంకుశ పాలనపై సాగిస్తున్న పోరాటాన్ని మరింత ఉధృతం చేసే దిశగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అడుగులు వేస్తోంది. ప్రజా సమస్యలు, ప్రభుత్వ వైఫల్యాలు, తాజా రాజకీయ పరిణామాలు, భవిష్యత్ కార్యాచరణపై మంగళవారం విజయవాడలో జరిగే పార్టీ విస్తృతస్థాయి సమావేశంలో చర్చించనున్నట్లు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు తెలిపారు. విజయవాడ బందరు రోడ్డులోని ఏ-1 కన్వెన్షన్ సెంటర్‌లో మంగళవారం ఉదయం 9 గంటలకు పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అధ్యక్షతన రాష్ట్ర కార్యవర్గ సమావేశం ప్రారంభమై గంటసేపు సాగుతుంది.

అనంతరం 10 గంటల నుంచి ప్రారంభమయ్యే కార్యవర్గ విస్తృతస్థాయి సమావేశం సాయంత్రం 5 గంటల వరకూ కొనసాగుతుందని పార్టీ వర్గాలు తెలిపాయి. ఉదయం 8.30 గంటలకు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి గన్నవరం విమానాశ్రయానికి చేరుకుంటారు. అక్కడినుంచి నేరుగా రోడ్డుమార్గాన ఎ-కన్వెన్షన్ సెంటర్‌లో జరిగే సమావేశానికి హాజరవుతారు. సమావేశంలో పాల్గొనడానికి  ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ శ్రేణులు, నేతలు, ప్రజా ప్రతినిధులు ఉత్సాహంగా కదలి వస్తున్నారు. ఇప్పటికే చంద్రబాబు వైఫల్యాలపై ప్రజలకు అవగాహన కలిగించడానికి రాష్ట్ర వ్యాప్తంగా ‘గడప గడపకూ వైఎస్సార్’ అనే కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా చేపట్టాలని పార్టీ నిర్ణయించింది. సంక్షేమ పథకాల ప్రదాతగా పేరుగాంచిన దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి జయంతి రోజైన జూలై 8 నుంచి ఈ కార్యక్రమాన్ని జనంలోకి పకడ్బందీగా తీసుకెళ్లే అంశంపై అధ్యక్షుడు జగన్ పార్టీ శ్రేణులకు దిశా నిర్దేశం చేయనున్నారు
Share this article :

0 comments: