చంద్రబాబూ.. నీ బావమరిది సినిమాలే చూడాలా? - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » చంద్రబాబూ.. నీ బావమరిది సినిమాలే చూడాలా?

చంద్రబాబూ.. నీ బావమరిది సినిమాలే చూడాలా?

Written By news on Tuesday, June 14, 2016 | 6/14/2016

విజయవాడ: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మీడియాను భయపెట్టి సొంత డబ్బా కొట్టించుకుంటున్నారని వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యే కొడాలి నాని విమర్శించారు. మంగళవారం విజయవాడలో జరుగుతున్న వైఎస్ఆర్ సీపీ విస్తృత స్థాయి సమావేశంలో ఆయన ప్రసంగించారు.

చంద్రబాబు అవినీతి, ఆయన చిల్లర రాజకీయాల గురించి చూపిస్తారని సాక్షి టీవీ ప్రసారాలను ఆపేశారని కొడాలి నాని ఆరోపించారు. రాష్ట్రం ఏమైనా మీ జాగీరా? మీ బావమరిది, మీ తమ్ముడి కొడుకు సినిమాలనే టీవీలో చూడాలా? మాకు నచ్చిన చానెల్ ను చూడనివ్వరా? అంటూ చంద్రబాబును నిలదీశారు. సాక్షి టీవీ ప్రసారాలను పునరుద్ధరించకుంటే తీవ్ర పరిణామాలుంటాయని అన్నారు. తాము తలచుకుంటే రాష్ట్రంలో ఏ చానెల్ కూడా రాదని హెచ్చరించారు. చంద్రబాబుకు వ్యతిరేకంగా వార్తలను ప్రసారం చేసే చానళ్లను అడ్డుకోవడం దారుణమని కొడాలి నాని విమర్శించారు.
Share this article :

1 comments:

Unknown said...

block all the channels. appudu gaani, bollodiki buddi raadu