వైఎస్సార్ సీపీలోనూతనోత్సాహం - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » వైఎస్సార్ సీపీలోనూతనోత్సాహం

వైఎస్సార్ సీపీలోనూతనోత్సాహం

Written By news on Thursday, June 30, 2016 | 6/30/2016


వైఎస్సార్ సీపీలోనూతనోత్సాహం
♦ జిల్లా పార్టీ అధ్యక్షుడిగా బాలినేనికి బాధ్యతలు
♦ నేడు ఒంగోలుకు రాక.. నగరంలో పార్టీ శ్రేణుల భారీ ర్యాలీ
♦ ఘన స్వాగతం పలికేందుకు ఏర్పాట్లు
 సాక్షి ప్రతినిధి, ఒంగోలు: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడిగా మాజీ మంత్రి ఆ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బాలినేని శ్రీనివాసరెడ్డి పార్టీ జిల్లా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టడంతో జిల్లాలోని పార్టీ శ్రేణుల్లో నూతనోత్సాహం నెలకొంది. సార్వత్రిక ఎన్నికల అనంతరం క్రియాశీలక రాజకీయాలకు బాలినేని కొంత దూరంగా ఉన్నారు. పార్టీ జిల్లా అధ్యక్షుడిగా ఉన్న గిద్దలూరు ఎమ్మెల్యే ముత్తుముల అశోక్‌రెడ్డి అధికార పార్టీలో చేరిన నేపథ్యంలో బాలినేని వైఎస్సార్ సీసీ జిల్లా అధ్యక్ష బాధ్యతలు భుజానికెత్తుకొని పార్టీని ముందుకు నడిపేందుకు సిద్ధమయ్యూరు. దీంతో జిల్లా వ్యాప్తంగా ఆపార్టీ శ్రేణులు ఉత్సాహంతో ఉన్నారు.
బాలినేనికి జిల్లావ్యాప్తంగా విస్తృత పరిచయాలు, పార్టీ కేడర్‌తో సత్సంబంధాలున్నాయి. మంచి మాస్ ఫాలోయింగ్ ఉంది. ఆయన పార్టీ జిల్లా అధ్యక్ష పదవి బాధ్యతలు స్వీకరించి, క్రియాశీలకంగా పని చేస్తే కేడర్ మరింత ఉత్సాహంగా పని చేసి, పార్టీని మరింత బలోపేతం చేసే అవకాశం ఉంది. జిల్లా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన బాలినేని తొలిసారి గురువారం ఒంగోలుకు రానున్నారు. ఈ సందర్భంగా పార్టీ నేతలు, కార్యకర్తలు, అభిమానులు ఆయనకు ఘనస్వాగతం పలికేందుకు సిద్ధమయ్యారు. నగరంలో పెద్ద ఎత్తున ప్లెక్సీలు, స్వాగత తోరణాలు ఏర్పాటు చేశారు. గురువారం మధ్యాహ్ననికి నెల్లూరు ప్రధాన రహదారిలోని వల్లూరమ్మ దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి అక్కడ నుంచి ర్యాలీగా రామ్‌నగర్, చర్చిసెంటర్, ట్రంకురోడ్డు, కర్నూలు రోడ్డు, ఫై ్లఓవర్ బ్రిడ్జి, మంగమూరు రోడ్డు మీదుగా జిల్లా పార్టీ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహిస్తారు.
Share this article :

0 comments: