నాగార్జున రెడ్డి కుటుంబానికి వైఎస్ జగన్ పరామర్శ - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » నాగార్జున రెడ్డి కుటుంబానికి వైఎస్ జగన్ పరామర్శ

నాగార్జున రెడ్డి కుటుంబానికి వైఎస్ జగన్ పరామర్శ

Written By news on Wednesday, June 1, 2016 | 6/01/2016


అనంతపురం: అప్పుల బాధతో ఆత్మహత్య చేసుకున్న రైతులు, చేనేతల కుటుంబాలను పరామర్శించేందుకు రైతు భరోసా యాత్రలో భాగంగా బుధవారం అనంతపురం జిల్లా పర్యటనకు వచ్చిన వైఎస్ఆర్ సీపీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్.. పెదవడుగూరు మండలం దిమ్మగుడిలో కౌలు రైతు నాగార్జున రెడ్డి కుటుంబాన్ని పరామర్శించారు. పత్తి పంట వేసి అప్పుల పాలవడంతో నాగార్జున రెడ్డి ఆత్మహత్యకు పాల్పడ్డాడు.

అంతకుముందు చిన్నవడుగూరులో అప్పులబాధతో ఆత్మహత్య చేసుకున్న రైతు బోయ నాగన్న కుటుంబాన్ని వైఎస్ జగన్ పరామర్శించారు. రైతు భరోసా యాత్ర సందర్భంగా పలువురు రైతులు.. చంద్రబాబు ప్రభుత్వం తమను దారుణంగా మోసం చేసిందని వైఎస్ జగన్ వద్ద వాపోయారు.  
Share this article :

0 comments: