ఇక్కడ తెలుగులో తిట్టి.. అక్కడ పొగుడుతారు - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » ఇక్కడ తెలుగులో తిట్టి.. అక్కడ పొగుడుతారు

ఇక్కడ తెలుగులో తిట్టి.. అక్కడ పొగుడుతారు

Written By news on Sunday, June 5, 2016 | 6/05/2016


'ఇక్కడ తెలుగులో తిట్టి.. అక్కడ పొగుడుతారు'
అనంతపురం: అనేక హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన చంద్రబాబునాయుడు పదేపదే అబద్ధాలు చెప్తూ ప్రజలను మోసం చేస్తున్నారని వైఎస్ఆర్‌ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్‌ మోహన్‌ రెడ్డి ధ్వజమెత్తారు. చంద్రబాబునాయుడు సర్కార్‌ ప్రజావ్యతిరేక విధానాలకు నిరసనగా అనంతపురం పట్టణంలోని అంబేద్కర్‌ సర్కిల్‌లో వైఎస్‌ జగన్‌ నేతృత్వంలో ప్రజాస్వామ్య పరిరక్షణ ధర్నాను చేపట్టారు. ఈ ధర్నాకు వైఎస్‌ఆర్‌ సీపీ నేతలు, కార్యకర్తలు, వైఎస్ జగన్ అభిమానులు, ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చారు. ఈ సందర్భంగా వైఎస్‌ జగన్‌ నినాదాలతో అంబేద్కర్ సర్కిల్ మారుమోగింది. భారీగా తరలివచ్చిన జనాన్ని ఉద్దేశించి వైఎస్ జగన్ మాట్లాడుతూ కరువు బాధిస్తున్నా, కష్టాలు వెంటాడుతున్నా, అధికార టీడీపీ అడ్డంకులు కల్పిస్తున్నా ఈ ధర్నాకు వేలాదిగా తరలివచ్చిన ప్రజందరి ఆప్యాయత, అనురాగాలకు పేరుపేరునా కృతజ్ఞతలు తెలిపారు.
 
ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇవ్వాలని ప్రధానమంత్రి నరేంద్రమోదీకి అల్టిమేటం ఇవ్వడానికి చంద్రబాబు భయపడుతున్నారని, ప్రత్యేక హోదాపై గట్టిగా నిలదీస్తే.. ఈ రెండేళ్లకాలంలో జరిగిన తన అవినీతిపై మోదీ ఎక్కడ దర్యాప్తు చేయిస్తారోనని చంద్రబాబు జంకుతున్నారని వైఎస్ జగన్ అన్నారు. అందుకే హైదరాబాద్‌లో, ఏపీలో నరేంద్రమోదీని తెలుగులో తిడుతూ.. ఢిల్లీలో మాత్రంలో ఇంగ్లిష్‌లో ఆయనను పొగుడుతున్నారని బాబు తీరును కడిగిపారేశారు. సినిమాల్లో విలన్ మాదిరిగా చంద్రబాబు వ్యవహరిస్తున్నారని ఎద్దేవా చేశారు. విలన్ ఆరంభంలో పైచేయి సాధించినా చివరకు హీరో చేతిలో ఓడిపోక తప్పదని అన్నారు. ఆయన ఇంకా ఏమన్నారంటే..
  • ఒకే అబద్ధాన్ని చెప్పిందే చెప్తూ చంద్రబాబు ప్రజలను మోసం చేస్తున్నారు
  • ఈ రెండేళ్ల పాలనలో చంద్రబాబు అవినీతిలో నిండా కూరుకుపోయారు
  • ఈ రెండేళ్లలో ప్రజాస్వామ్యాన్ని పట్టపగలే బాబు ఖూనీ చేశారు
  • ఎన్నికల సమయంలో చంద్రబాబు భారీగా హామీలు గుప్తిస్తూ ప్రచారం చేశారు
  • గ్రామాల్లో ఏర్పాటుచేసిన ఫ్లెక్సీల్లోనూ, టీవీల్లోనూ, ఉపన్యాసాల్లోనూ హామీల గురించి పదేపదే చెప్పారు. ఆఖరికీ గోడలనూ వదిలిపెట్టకుండా రాతలు రాసి ప్రచారం చేశారు
  • జాబు రావాలంటే బాబు ముఖ్యమంత్రి కావాలని పదేపదే చెప్పారు
  • బ్యాంకులోని బంగారం ఇంటికి రావాలంటే బాబు సీఎం కావాలని చెప్పారు
  • కానీ ఇప్పుడు బ్యాంకు రుణాలు చెల్లించకపోవడంతో అధికారులు రైతులను వేధిస్తున్నారు
  • బ్యాంకుల్లోని రైతుల బంగారం వేలం వేస్తున్నారు
  • రైతురుణాలు పూర్తిగా మాఫీ చేస్తానని చంద్రబాబు మాట ఇచ్చారు
  • 87వేల కోట్ల రుణాలు మాఫీ చేస్తామని బాబు హామీ ఇచ్చారు
  • కానీ ఆ హామీ నెరవేర్చకపోవడంతో ఇప్పుడు రైతులు 25వేల కోట్లకుపైగా వడ్డీలు కట్టాల్సి వస్తోంది
  • చంద్రబాబు చేసిన రుణమాఫీ వడ్డీలో వందోశాతం కూడా సరిపోవడంలేదు
  • ఎన్నికలప్పుడు డ్వాకా అక్కాచెల్లెమ్మల రుణాలు పూర్తిగా మాఫీ చేస్తానని బాబు చెప్పారు
  • ఇప్పుడు మాఫీ సంగతి దెవుడెరుగు, ముష్టిగా మూడువేలు ఇచ్చి.. అది కూడా అప్పుగా కట్టాలని బాబు అంటున్నారు
  • బాబు ముఖ్యమంత్రి అయ్యాక ఉన్న ఉద్యోగాలను ఊడబెరుకుతున్నారు
  • జాబు ఇవ్వకపోతే ప్రతి ఇంటికి రూ. 2వేలు నిరుద్యోగ భృతి ఇస్తానని బాబు మాట తప్పారు
  • రాష్ట్రంలో ఎవరికీ ఉద్యోగాలు రాలేదు. నిరుద్యోగ భృతి కూడా అందడం లేదు
  • ప్రత్యేక హోదాపై ప్రధాని నరేంద్రమోదీకి బాబు అల్టిమేటం ఇవ్వడానికి భయపడుతున్నారు
  • ఇటు కేసీఆర్‌ను కూడా గట్టిగా నిలదీయడం లేదు
  • కృష్ణ, గోదావరి నదుల మీద అడ్డగోలుగా కేసీఆర్‌ ప్రాజెక్టులు కడుతున్నారు
  • మహబూబ్‌నగర్‌లో ఎడాపెడా లిఫ్టులు కట్టి నీళ్లు తరలించుకుపోతున్నారు
  • అయినా చంద్రబాబు కేసీఆర్‌ను కనీసం ఏమీ అనడం లేదు
  • ఇందుకు కారణం చంద్రబాబుకు చెందిన వ్యక్తి సూట్‌కేసులో డబ్బులు తీసుకొని పోయి ఎమ్మెల్యేలను కొనుగోలుకు ప్రయత్నిస్తూ అడ్డంగా దొరికిపోవడమే. ఆ సూట్‌కేస్ నిండా నల్లధనమే
  • ఆ సమయంలో చంద్రబాబు ఫోన్‌లో ఏం మాట్లాడారంటే 'మనవాళ్లు బ్రీఫ్‌డ్‌ మి' అంటూ మాట్లాడారు.
  • నల్లధనంతో ఎమ్మెల్యేలను కొనుగోలుకు చంద్రబాబు ప్రయత్నించి ఏడాది అయినా ఇప్పటికీ ఆయనను జైలులో పెట్టలేదు
  • 'మన వాళ్లు బ్రీఫ్‌డ్‌ మి' అనే మాటలు మళ్లీ బయటకొస్తాయనే భయంతోనే చంద్రబాబు కేసీఆర్‌ను నిలదీయడం లేదు
  • ఈ రెండేళ్లలో చంద్రబాబు విచ్చలవిడిగా అవినీతికి పాల్పడ్డారు
  • చంద్రబాబు సినిమాల్లో విలన్ మాదిరిగా వ్యవహరిస్తున్నాడు
  • సినిమా చివరి వరకు విలన్ ఆధిపత్యం చెలాయిస్తాడు
  • హీరో అమాయకుడు ఎమ్మెల్యేలను కొనలేడు, క్లైమాక్స్ వచ్చే సరికి కథ అడ్డం తిరుగుతుంది విలన్ జైలుకు పోతాడు
  • మోసం చేసే వాళ్లకు రాయలసీమలో అయితే చెప్పు చూపించాలని అంటారు
  • కానీ 'చెప్పు' అని నేనైతే అనడం లేదు. చెప్పు చూపించమంటే చంద్రబాబు ఉలిక్కి పడుతున్నారు
  • చెప్పుకు బదులు ఈసారి చీపురు చూపించండి
  • బాబు మోసాల కారణంగా అనంతపురం జిల్లాలో 80 మంది ఆత్మహత్య చేసుకున్నారు. అందులో 14 మంది నేత కార్మికులు
  • నాయకులు మాట మీద నిలబడాలి. మాటమీద నిలబడితేనే విశ్వసనీయత ఉంటుంది
  • రాజకీయాల్లో విశ్వసనీయత ఉన్న నాయకుడు దివంగత మహానేత వైఎస్ఆర్ అయితే... విశ్వసనీయతకు వెన్నుపోటు పొడిచిన వ్యక్తి చంద్రబాబు
  • హామీలు నెరవేర్చకుంటే ఎవరు అడుగుతారని బాబు అనుకోవచ్చు
  • ప్రజల గొంతు నొక్కాలని ఎమ్మెల్యేలను విచ్చలవిడిగా కొంటున్నారు
  • ఎమ్మెల్యేలను కొనుగోలు చేయడానికి రూ. 600 కోట్లు ఎక్కడి నుంచి వచ్చాయని ప్రజలు ప్రశ్నిస్తున్నారు
  • ఎమ్మెల్యేలను నిసిగ్గుగా కొని వాళ్ల చేత రాజీనామా చేయించరు, అనర్హులుగా ప్రకటించరు
  • మా ఎమ్మెల్యేలు పోయినచోట ప్రజలే మళ్లీ నాయకుడిని తెచ్చుకుంటారు
  • ఎల్లకాలం చంద్రబాబు పాలన సాగదు. దయచేసి ప్రజాస్వామ్యం కాపాడమని చెప్పినా పట్టించుకోవడం లేదు
  • మీ అందరితో కలిసి ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం పోరాడుతూనే ఉంటాం




Share this article :

0 comments: