నీళ్లడిగితే దాడులు చేయిస్తారా? - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » నీళ్లడిగితే దాడులు చేయిస్తారా?

నీళ్లడిగితే దాడులు చేయిస్తారా?

Written By news on Sunday, June 5, 2016 | 6/05/2016


నీళ్లడిగితే దాడులు చేయిస్తారా?
అనంతపురం రూరల్:   నీళ్లడిగితే దాడులు చేయిస్తారా? అని టీడీపీ నాయకలపై   వైఎస్సార్ సీపీ నాయకులు చవ్వా రాజశేఖర్‌రెడ్డి, జిల్లా అధికార ప్రతినిధి ఆలమూరు శ్రీనివాసరెడ్డి,  జడ్పీ ఫ్లోర్ లీడర్ వెన్నపూస రవీంద్రారెడ్డి మండిపడ్డారు. గురువారం వారు శనివారం స్థానిక ప్రెస్‌క్లబ్‌లో వేర్వేరుగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు.  హంద్రీ-నీవా ప్రాజెక్టు ద్వారా జిల్లాకు రావాల్సిన సాగునీటిని రాకుండా చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం జీఓ 22ను విడుదల చేసి జిల్లా రైతాంగానికి చేస్తున్న అన్యాయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్తుంటే జీర్ణించుకోలేని టీడీపీ నాయకులు  భయానక వాతావరణాన్ని సృష్టిస్తున్నారని మండిపడ్డారు. జిల్లాలో వైఎస్సార్‌సీపీ నాయకులపై భౌతిక దాడులకు పాల్పడుతూ టీడీపీ నేతలు భయాందోళన సృష్టిస్తున్నా. పోలీసులు ప్రేక్షకపాత్ర పోషిస్తున్నారని ఆరోపించారు.


అక్రమ కేసులు ఎత్తివేయాలి..  వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలపై పెట్టిన అక్రమ కేసులను ఎత్తివేయా లని వారు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కనగానపల్లి మండలం కుర్లపల్లి ఘటనపై వైఎస్సార్‌సీపీ రాప్తాడు నియోజకవర్గ సమన్వయకర్త తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి, చందు, కనగానపల్లి జడ్పీటీసీ ఈశ్వరయ్యపై నమోదు చే సిన అక్రమ కేసులను ఉపసంహరించుకోవాలన్నారు.  సమావేశంలో  వైఎస్సార్‌సీపీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి మీసాల రంగన్న, ట్రేడ్ యూనియన్ నాయకులు ఆదినారాయుణరెడ్డి, ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షుడు పెన్నో బిలేసు, నాయకులు రాజేష్‌రెడ్డి, అనిల్‌కుమార్ , రామచంద్రారెడ్డి, నరసింహారెడ్డి, తిరుపాల్‌రెడ్డి, చెన్నారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Share this article :

0 comments: