బిచ్చమడిగితే పెట్టుబడులు రావు: అంబటి - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » బిచ్చమడిగితే పెట్టుబడులు రావు: అంబటి

బిచ్చమడిగితే పెట్టుబడులు రావు: అంబటి

Written By news on Monday, June 27, 2016 | 6/27/2016

హైదరాబాద్ : దేశంలోనే అత్యంత విలాసవంతమైన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడేనని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు వ్యాఖ్యానించారు. ఓవైపు కట్టుబట్టలతో హైదరాబాద్ నుంచి వచ్చేశామని చెబుతూనే...మరోవైపు చంద్రబాబు విలాలసవంతమైన జీవినం కొనసాగిస్తున్నారని ఆయన ధ్వజమెత్తారు. సోమవారం అంబటి రాంబాబు పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడారు.
పెట్టుబడుల కోసం విదేశీ పర్యటనలంటూ ఎంత కాలం మోసం చేస్తారని ఆయన ప్రశ్నించారు.  ఈ రెండేళ్ల కాలంలో ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొచ్చిన ఒక్క కంపెనీ ఉందా అని అంబటి రాంబాబు ప్రశ్నించారు. ప్రత్యేక విమానాల్లో తరలుతున్న సూట్ కేసుల్లో ఏమున్నాయో చెప్పాలని అంబటి డిమాండ్ చేశారు. ఏపీలో దోచుకున్న సొమ్ము విదేశాల్లో దాచుకోవడానికి వెళుతున్నా అని అడిగారు. చంద్రబాబు విదేశీ పర్యటనలపై కేంద్రం దృష్టి సారించాలని ఆయన సూచించారు.

విదేశాల్లో బిచ్చగాడిలో అడుక్కుంటే పెట్టుబడులు రావని, రాష్ట్రంలో సదుపాయాలు బాటుంటేనే పెట్టుబడులు వస్తాయని అంబటి అన్నారు. ఏపీకి ప్రత్యేక హోదా ఉంటే పెట్టుబడులు అవే వస్తాయన్నారు. విదేశీ వ్యామోహంతో అమరావతిని చంద్రబాబు సర్వనాశనం చేస్తున్నారని ధ్వజమెత్తారు. ఎంవోయులు, స్విస్ ఛాలెంజ్ ల పేరుతో దొంగ ఒప్పందాలు చేసుకుంటున్నారని అంబటి విమర్శించారు. విదేశాల మోజులో స్వదేశీ పారిశ్రామిక వేత్తలను కించపరుస్తున్నారని అన్నారు. చంద్రబాబు విదేశీ పర్యటనల వల్ల ఒక్క రూపాయి లాభం లేదన్నారు. జపాన్ నుంచి అమరావతికి ఒక్క పైసా పెట్టుబడి కూడా రాలేదని అంబటి ఈ సందర్భంగా గుర్తు చేశారు. కాగా అయిదురోజుల పర్యటన నిమిత్తం చంద్రబాబు చైనా వెళ్లిన విషయం తెలిసిందే.
Share this article :

0 comments: