ఈ పార్టీ మనది, దీన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన బాధ్యత మీ అందరిపై ఉంది - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » ఈ పార్టీ మనది, దీన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన బాధ్యత మీ అందరిపై ఉంది

ఈ పార్టీ మనది, దీన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన బాధ్యత మీ అందరిపై ఉంది

Written By news on Tuesday, June 14, 2016 | 6/14/2016


'ఐదేళ్ల క్రితం అమ్మ, నేను మాత్రమే ఉన్నాం'
విజయవాడ: ఐదేళ్లుగా ప్రజల తరపున ప్రతి క్షణం పోరాడుతున్నామని ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నాయకుడు, వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అన్నారు. మంగళవారమిక్కడ ప్రారంభమైన వైఎస్సార్ సీపీ విస్తృతస్థాయి సమావేశం ప్రారంభంలో ఆయన మాట్లాడారు. ప్రజల గుండెల్లో స్థానం సంపాదించుకోవడానికి పనిచేయాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. ప్రజా వ్యతిరేక కార్యకలాపాలపై పోరాడుడుతూ ప్రజల గొంతుకలా కావాలని అన్నారు. రాజన్న రాజ్యం కోసం నిరంతం పోరాటం చేయాలని కోరారు. మేధామధనం చేసుకుని, దశదిశ నిర్దేశించుకుందామని అన్నారు.

ఆయన ఇంకా ఏమన్నారంటే...
 • ఐదేళ్లుగా ప్రజల తరపున నిరంతర పోరాటం చేస్తున్నాం
 • ప్రజల గుండెల్లో స్థానం కోసం పని చేస్తున్నాం
 • ఐదేళ్ల క్రితం వైఎస్సార్ సీపీలో నేను, అమ్మ మాత్రమే ఉన్నాం
 • ఆ తర్వాత 18 మంది ఎమ్మెల్యేలు గెలిచారు
 • అనంతరం 67 మంది ఎమ్మెల్యేలు, 9 మంది ఎంపీలు గెలిచారు
 • 45 శాతం ఓట్ల షేర్ తో కోటి 30 లక్షల మంది ఆదరణ పొందాం
 • మీ అందరి కృషి, సహాయ సహకారాల వల్లే ఇదంతా సాధ్యమైంది
 • ఈ పార్టీ మనది, దీన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన బాధ్యత మీ అందరిపై ఉంది
 • మళ్లీ రాజన్న రాజ్యం రావాలన్న దిశగా అడుగులు వేద్దాం
 • చంద్రబాబు పాలన ఇక వద్దు అన్న పరిస్థితుల మధ్య మనమంతా ఇక్కడ సమావేశమయ్యాం
 • చంద్రబాబు కుయుక్తులను ఏవిధంగా అధిగమించాలో చర్చిద్దాం
 • ప్రజల గొంతుక ఎలా కావాలో మేధామధనం చేసుకుందాం
 • వివిధ అంశాలపై పార్టీలోని పెద్దలు, నాయకులు చర్చిస్తారు, తీర్మానాలు కూడా చేస్తారు
 • వివిధ అంశాలపై దశదిశ నిర్దేశం జరుగుతుంది
 • పార్టీ చేపట్టాల్సిన కార్యక్రమాల గురించి వివరిస్తూ చివర్లో ప్రసంగిస్తాను
 • అందరూ ఇక్కడికి వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొన్నందుకు పేరుపేరునా ధన్యవాదాలు తెల్పుతున్నా
Share this article :

0 comments: