మద్యం వ్యాపారులు.. సంఘ సంస్కర్తలా? - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » మద్యం వ్యాపారులు.. సంఘ సంస్కర్తలా?

మద్యం వ్యాపారులు.. సంఘ సంస్కర్తలా?

Written By news on Sunday, June 26, 2016 | 6/26/2016


మద్యం వ్యాపారులు.. సంఘ సంస్కర్తలా?
► కేఈ ప్రతాప్‌ది సొంత నిర్ణయాలు తీసుకోలేని దౌర్భాగ్యస్థితి
► ఉప ముఖ్యమంత్రి హోదాలో వాడుక భవనాలకు ప్రారంభోత్సవాలా?
 సోమిశెట్టి గురించి పెట్రోల్ బంక్, కిరాణ షాపుల యజమానులకు తెలుసు
► టీడీపీ నాయకులపై పీఏసీ చైర్మన్ బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి విమర్శలు
 


 కర్నూలు(ఓల్డ్‌సిటీ): మద్యం వ్యాపారంలో సంబంధాలు ఉన్న వ్యక్తులు సంఘ సంస్కర్తలు ఎలా అవుతారని పీఏసీ చైర్మన్, డోన్ శాసనసభ్యుడు బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి టీడీపీ నేతలను ప్రశ్నించారు. శనివారం రాత్రి ఆయన విడుదల చేసిన ప్రకటనలో టీడీపీ నేతలపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. సంఘ సంస్కర్త కోటాలో జన్మభూమి కమిటీలో సభ్యుడిగా చేరిన డోన్ నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జ్ కేఈ ప్రతాప్‌కు నియోజకవర్గంలోని మద్యం దుకాణాలకు సంబంధం లేదా అని ప్రశ్నించారు. ప్రభుత్వ ధర కంటే 10 శాతం అధికంగా విక్రయ్తిండటం వాస్తవం కాదా అని పేర్కొన్నారు. అలాంటి వ్యక్తికి తనను పత్రిక  ప్రకటన ద్వారా ఆహ్వానించే అర్హత లేదన్నారు. నియోజకవర్గంలో ప్రస్తుతం వాడుకలో ఉన్న భవనాలను ఉప ముఖ్యమంత్రి హోదాలో కేఈ కృష్ణమూర్తి ప్రారంభించడం ఎంత వరకు సమంజసమన్నారు. గత ప్రభుత్వాల పథకాలకు కేఈ సోదరులు ప్రారంభోత్సవాలు చేస్తున్నారంటూ విమర్శించారు.

ఆయా పథకాలకు నిధులు ఎవరు మంజూరు చేశారో ప్రజలకు చెప్పాల్సిన బాధ్యత వారిపై ఉందన్నారు. ప్రజలు ఎన్నుకున్న ఎమ్మెల్యేలను చులకన చేయడం, అధికారులను బెదిరించడం, ప్రతిపక్ష పార్టీ నేతలు, కార్యకర్తలపై తప్పుడు కేసులు బనాయించడం, దౌర్జన్యానికి పాల్పడటమే ధ్యేయంగా కేఈ సోదరులు వ్యవహరిస్తున్నారన్నారు.


సోమిశెట్టి చరిత్ర అందరికీ తెలుసు
తనకు మతిభ్రమించిందంటూ సోమిశెట్టి వెంకటేశ్వర్లు మాట్లాడటం విడ్డూరంగా ఉందన్నారు. ప్రపంచంలో అందరి చిట్టాలు విప్పే అతని చరిత్ర గురించి ఎవరికీ తెలియదనుకోవడం అవివేకమన్నారు. ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే రాత్రికి రాత్రే  పార్టీ అధ్యక్ష పదవి నుంచి ఆయనను తొలగించడం వాస్తవం కాదా అని గుర్తు చేశారు. ఆయన వసూళ్ల గురించి కర్నూలులో ఏ పెట్రోల్ బంక్, కిరాణ షాపు యజమానిని అడిగినా చెబుతారన్నారు. అలాంటి వ్యక్తులను తనను విమర్శించే స్థాయి ఎక్కడిదని ప్రశ్నించారు.
Share this article :

0 comments: