ఔత్సాహిక నాయకులకు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సూచన - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » ఔత్సాహిక నాయకులకు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సూచన

ఔత్సాహిక నాయకులకు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సూచన

Written By news on Tuesday, June 14, 2016 | 6/14/2016


నాయకులు కావాలంటే ఇదే సీక్రెట్
► నియోజకవర్గంలో ఇంటింటికీ వెళ్లండి
► వారి యోగక్షేమాలు కనుక్కోండి
► చంద్రబాబుకు ఎన్ని మార్కులు వేస్తారో చూడండి
► పనిలో పనిగా బూత్ కమిటీలు కూడా నియమించండి
► ఔత్సాహిక నాయకులకు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సూచన
► ఐదేళ్లుగా అలుపులేని పోరాటం
► అడుగడుగునా అండగా నిలిచిన కార్యకర్తలకు కృతజ్ఞతలు
► చంద్రబాబుకు, మనకు ఓట్ల తేడా 5 లక్షలే
► 13 రీళ్ల వరకు విలన్‌దే పై చేయి గానీ.. 14వ రీల్‌లో హీరో రివర్స్ అవుతాడు
► నాయకులు మోసాలు చేస్తే చెప్పులు, చీపుర్లు చూపించండి
► వ్యవస్థలో మార్పు రాకపోతే ప్రజాస్వామ్యం బతకదు
► ముద్రగడ పద్మనాభం దీక్షకు పూర్తి సంఘీభావం
► విజయవాడలో ఘనంగా ముగిసిన వైఎస్ఆర్‌సీపీ విస్తృత స్థాయి సమావేశం
విజయవాడ
నాయకులు కావాలంటే తండ్రులో.. తాతలో ఎమ్మెల్యేలు కావాల్సి అవసరం లేదని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అన్నారు. నాయకులు కావాలంటే తాను ఒక సీక్రెట్ చెబుతానన్నారు. నియోజకవర్గం పరిధిలో ఉన్న ప్రతి పంచాయతీలో ప్రతి ఇంటికీ వెళ్లాలని.. 'గడప గడపకూ వైఎస్ఆర్' అనే ఈ కార్యక్రమాన్ని దివంగత మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి జయంతి అయిన
జూలై 8వ తేదీ నుంచి ప్రారంభించాలని తెలిపారు. విజయవాడలో జరిగిన పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో ఆయన ముగింపు ప్రసంగం చేశారు. ఆయన ఏమన్నారో ఆయన మాటల్లోనే...

ఈరోజు వివిధ జిల్లాల నుంచి విస్తృతస్థాయి సమావేశానికి విచ్చేసిన పార్లమెంటు సభ్యులు, శాసన సభ్యులు, మండలి సభ్యులు, పార్లమెంటరీ నియోజకవర్గ కోఆర్డినేటర్లు, అసెంబ్లీ నియోజకవర్గ కోఆర్డినేటర్లు, జిల్లా పార్టీ అధ్యక్షులు, అనుబంధ సంస్థల అధ్యక్షులు, మండల స్థాయి పార్టీ అధ్యక్షులు, జడ్పీ చైర్మన్లు, మండలాధ్యక్షులు, కార్పొరేషన్ల మాజీ అధ్యక్షులు అందరికీ..  ఇక్కడికొచ్చిన ప్రతి ఒక్కరికీ.. అడుగులో అడుగు వేసి తోడుగా ఉన్నామని చెప్పినందుకు అందరికీ చేతులు జోడించి, శిరస్సు వంచి కృతజ్ఞతలు చెబుతున్నాం
 • మన పార్టీ స్థాపించి ఐదు సంవత్సరాలు అయింది
 • ఈ ఐదేళ్లలో ప్రతిపక్ష పాత్ర పోషిస్తూనే వస్తున్నాం
 • ఎక్కడ ఎవరికి ఏ సమస్య వచ్చినా పార్టీ అధ్యక్షుడిగా నేను స్పందిస్తూనే ఉన్నా
 • పార్టీపరంగా కూడా ఎవరూ వెనకడుగు వేయకుండా ప్రజలకు అండగా ఉన్నా
 • ఈ ఐదేళ్లలో ప్రతిపక్ష నాయకుడిగా చంద్రబాబు ఉన్నప్పుడు కూడా ఆయన పోయాడో పోలేదో గానీ, ఎవరికి ఏసమస్య వచ్చినా జగన్ వారికి అండగా ఉన్నాడు
 • ఐదేళ్లు ఇదే పోరాటం చేశాం, అంచెలంచెలుగా పార్టీ ఎదిగింది
 • తొలుత అమ్మ, నేను ఇద్దరమే గెలిచాం. తర్వాత 18 మందికి వెళ్లాం, తర్వాత 67 మంది ఎమ్మెల్యేలు, 9 మంది ఎంపీలతో బలోపేతం అయ్యాం.
 • రాష్ట్రంలో 1.30కోట్ల మంది మనకు అండగా నిలిచారు.
 • మొన్నటి ఎన్నికల్లో చంద్రబాబుకు వచ్చినవి 1.35 కోట్లయితే, మనకు వచ్చినవి 1.30 కోట్ల ఓట్లు.. వారికి, మనకు మధ్య తేడా కేవలం 5 లక్షల ఓట్లు మాత్రమే
 • ఆ రోజు ఎన్నికల్లో చంద్రబాబు గెలవడానికి, ఆయన తినని గడ్డి లేదు, చేయని మోసం లేదు, చెప్పని అబద్ధం లేదు
 • చంద్రబాబు సీఎం అయితే అయ్యారు గానీ, అందుకు ఆయన చెప్పిన అబద్ధాలే సహకరించాయి
 • ఏ మీటింగులోనూ ఆయన రైతులను వదిలిపెట్టలేదు, డ్వాక్రా అక్క చెల్లెళ్లను మోసం చేశారు
 • ఫ్లెక్సీలకు లైట్లు పెట్టించి మరీ చదువుకునే పిల్లలనూ మోసం చేశారు
 • ఖాళీ గోడలు కనపడితే చాలు.. వాటిమీద రాతలు రాశారు
 • బ్యాంకుల్లో పెట్టిన బంగారం ఇంటికి రావాలంటే బాబు ముఖ్యమంత్రి కావాలన్నారు
 • ఇంటికి వెళ్లి టీవీ చూస్తే.. జాబు రావాలంటే బాబు రావాలన్నారు, లేకపోతే ఇంటింటికీ 2వేలు నిరుద్యోగ భృతి ఇస్తామన్నారు
 • సీఎం అయిన నెలలోనే రైతు రుణాలన్నీ పూర్తిగా, బేషరతుగా మాఫీ చేస్తానన్నారు
 • డ్వాక్రా అక్కచెల్లెమ్మల రుణాలన్నీ పూర్తిగా మాఫీకావాలంటే బాబు ముఖ్యమంత్రి కావాలన్న మాటలు మన చెవుల్లో ఈనాటికీ రింగురింగున మోగుతూనే ఉన్నాయి
 • బాబు సీఎం అయ్యాడు.. ఎన్నికల్లో మాటిచ్చిన ప్రజలకు మాత్రం వెన్నుపోటు పొడిచాడు
 • బాబు సీఎం అయ్యేనాటికి రైతు రుణాలు రూ. 87 వేల కోట్లు ఉండేవి
 • అంతవరకు లక్ష లోపు రుణం వడ్డీ లేకుండా, 3 లక్షల లోపు రుణం పావలా వడ్డీకే వచ్చేది
 • అవి కట్టొద్దని ఆయన చెప్పిన పాపానికి.. ఈవాళ అపరాధ వడ్డీ కింద రైతులు 14-18 శాతం వడ్డీ కడుతున్నారు
 • ఈ రెండేళ్లలో 87 వేల కోట్ల రైతు రుణాల మీద వడ్డీ రూపేణా 25వేల కోట్లు చెల్లించారు
 • చంద్రబాబు రుణమాఫీ చేసింది వడ్డీల్లో మూడోవంతు కూడా సరిపోలేదు
 • అదే రుణమాఫీ అని, రైతులకు పూర్తిగా రుణమాఫీ అయిపోయిందని నిస్సిగ్గుగా అబద్ధాలు చెబుతూ, మోసం చేస్తున్నారు
 • డ్వాక్రా అక్కచెల్లెమ్మలకు అంతకుముందు వడ్డీలేని రుణం వచ్చేది
 • వాళ్లు రుణాలు కట్టని కారణంగా బ్యాంకులకు పోతే 2- 2.50 చొప్పున వడ్డీలు వసూలు చేస్తున్నారు
 • చదువుకున్న పిల్లల పరిస్థితి మరీ దారుణం
 • జాబు రావాలంటే బాబు ముఖ్యమంత్రి కావాలనేవారు
 • ఉన్న ఉద్యోగాలు రేపు పొద్దున్న ఉంటాయో లేవో తెలియని దుస్థితిలో కాంట్రాక్టు ఉద్యోగులున్నారు
 • రోజుకో ఉద్యోగం ఊడుతోంది. ఆదర్శ రైతులు, ఫీల్డ్ అసిస్టెంట్లు ఇప్పటికే వెళ్లిపోయారు
 • గోపాలమిత్రలు ధర్నాలు చేస్తున్నారు
 • 2 వేల నిరుద్యోగ భృతి గురించి అడిగితే.. నేనెప్పుడు చెప్పానంటున్నారు

13 రీళ్ల వరకు విలన్‌దే పై చేయి కానీ...
 • ఇంత దారుణంగా మోసం చేసే వ్యక్తి, అబద్ధాలు చెప్పే వ్యక్తి సినిమాల్లో కనిపిస్తే ఆ వ్యక్తిని విలన్ అంటాం
 • ఆ రోజుల్లో అయితే రాజనాల లాంటి వాళ్లు, చంద్రబాబు వయసుకు తగ్గవాళ్లు కనిపిస్తే ఈయనే గుర్తుకొస్తారు
 • సినిమా 14 రీళ్లుంటే 13 రీళ్లు విలన్‌దే పైచేయిగా కనిపిస్తుంది ఆయన ఎన్ని మోసాలు చేసినా, అబద్ధాలు ఆడినా, ఎంత అన్యాయం చేసినా ఆయనదే పైచేయిగా కనిపిస్తుంది
 • కానీ 14వ రీలు వచ్చేసరికి కథ క్లైమాక్స్‌కు వస్తుంది
 • అక్కడ హీరో రివర్స్ అవుతాడు, ప్రజలు హీరోకు తోడుగా నిలబడతారు, దేవుడు ఆశీర్వదిస్తాడు
 • హీరో విలన్‌ను వీరబాదుడు బాదుతాడు
 • 14వ రీలు అయ్యేసరికి విలన్‌కు తగిన శిక్ష పడుతుంది
 • ఇది ఏ సినిమాలో చూసినా కనిపిస్తుంది, జీవితం అనే సినిమాలో కూడా చివరకు ఇదే జరుగుతుంది
 • చంద్రబాబు మాదిరిగా సీఎం కావడానికి, సీఎం రేసులో ఉన్నవ్యక్తి ఈ మాదిరిగా ప్రజలను మోసం చేస్తూ పోతే, సీఎం కుర్చీలో కూర్చోడానికి ఏ గడ్డయినా తింటానంటే.. ప్రజలు చూస్తూ ఊరుకుంటూ పోతే ఈ వ్యవస్థ బాగుపడుతుందా అని అడుగుతున్నా
చెప్పులు, చీపుర్లు చూపించండి
 • రాజకీయ వ్యవస్థ బాగుపడాలన్నా, నాయకులకు గౌరవం రావాలన్నా ప్రజలు చేయాల్సింది ఒకటుంది
 • నాయకులు మోసాలు చెబితే, అబద్ధాలు చెబితే చెప్పులు, చీపుర్లు చూపిస్తామని గట్టిగా నిలదీస్తే ఈ వ్యవస్థ మారుతుంది
 • ఈ ఛాలెంజ్ ఎందుకు చేస్తున్నానంటే.. రేపు నాకైనా ఇదే వర్తిస్తుంది
 • అబద్ధాలు ఆడితే ఎవరికైనా చెప్పులు, చీపుర్లు చూపించండి..
 • ఫలానా వాడు మా నాయకుడని కార్యకర్తుల కాలర్ ఎగరేసుకునేలా మార్పు రావాలి
 • మనమంతా కలిసికట్టుగా అడుగులు వేస్తేనే అది సాధ్యం
 • రేపు ఇదే చంద్రబాబు ఈసారికి రైతుల రుణాల మాఫీ మాత్రమే చెప్పాడు, బ్యాంకుల్లో బంగారం మాఫీ అన్నాడు, డ్వాక్రా రుణాలు మాఫీ అన్నాడు
 • రేపు ఎన్నికలకు చంద్రబాబు ఏమంటాడో తెలుసా.. ప్రతి ఇంటికీ కారు కొనిస్తానంటాడు, ప్రతి ఇంటికీ విమానం కొనిస్తానంటాడు
 • వ్యవస్థలో మార్పు రావాలంటే, రాజకీయ వ్యవస్థలో జవాబుదారీతనం తీసుకురావాలి
 • అప్పుడే ఈ వ్యవస్థ బాగుపడుతుంది
 • ఇన్ని రోజులూ రాజకీయాలు చూశాం. ప్రతి రాష్ట్రంలో అధికార, ప్రతిపక్షాలు ఉంటాయి
 • మన రాష్ట్రంలోనూ అది కొత్తేమీ కాదు. కాంగ్రెస్, టీడీపీ ఉండేవి
 • ఎవరైనా అధికారంలో ఉన్న వ్యక్తి 20 మంది ఎమ్మెల్యేలను ఒక్కొక్కరికి 30 కోట్ల డబ్బు, మంత్రి పదవి ఎర, కాంట్రాక్టుల మోజు చూపించి పశువుల్లా కొనే పరిస్థితి ఎక్కడైనా ఉందా
 • ఇది నిజంగా ఆశ్చర్చమే
 • పట్టపగలు ప్రజలు చూస్తున్నారన్న స్పృహ కూడా లేకుండా.. 20 మందికి ఒక్కొక్కరికి రూ. 30 కోట్ల చొప్పున దాదాపు 600 కోట్ల రూపాయలు వెచ్చించి ఎమ్మెల్యేలను కొంటున్నారు
 • ఇంత డబ్బు నీ అత్తగారి సొత్తా అని అడిగేవారు లేరంటే వ్యవస్థను చూసి బాధ అనిపిస్తుంది.
 • పట్టపగలు, అడ్డగోలుగా తెలంగాణలోనూ ఎమ్మెల్యేలను కొనుగోలు చేయాలని ప్రయత్నిస్తూ అక్కడ సూట్ కేసుల్లో డబ్బులిస్తూ. .. డబ్బుతో సహా ఆడియో, వీడియో టేపులతో దొరికిపోయిన వ్యక్తి దేశంలో ఎవరైనా ఉన్నారంటే అది చంద్రబాబే అనడానికి సిగ్గుపడాలి
 • ఒక ముఖ్యమంత్రి ఇంత నల్లధనంతో పట్టుబడినా జైలుకు పోని పరిస్థితి మన రాష్ట్రంలో, మన దేశంలోనే ఉందంటే ప్రజాస్వామ్యాన్ని చూసి సిగ్గుపడాలి
 • ఇదే పరిస్థితి కొనసాగితే ప్రజాస్వామ్యం బతకదు
 • ప్రజలతో పనిలేదు, ప్రజలకిచ్చిన మాటలతో పనిలేదు, అవినీతి విచ్చలవిడిగా చేస్తా, ఆ డబ్బుతో అవసరమైతే ఓటుకు 3, 4 వేలిచ్చి ప్రజలను కొనుగోలుచేస్తానని ముఖ్యమంత్రి స్థానంలో ఉండి చెబుతున్నారు
చంద్రబాబుకు ఓ సలహా ఇస్తున్నా..
 • చంద్రబాబు కు ఓ సలహా.. ప్రజా వ్యతిరేకత ఉన్నప్పుడు డబ్బులు పనిచేయవు
 • 2004 నాటికి తొమ్మిదేళ్లు సీఎంగా ఉండి విచ్చలవిడిగా అవినీతి చేశావు. కానీ అప్పుడు వైఎస్ఆర్ వచ్చారు.. పాదయాత్ర చేశారు.
 • నాడు 2004లో ఎన్నికలు అయ్యేనాటికి టీడీపీకి వచ్చినవి కేవలం 41 స్థానాలు మాత్రమే. చాలాచోట్ల ఆ నాయకులు డిపాజిట్లు కూడా కోల్పోయారు
 • ప్రజల గుండెల్లో స్థానం సంపాదించుకోవాలి తప్ప ప్రజలను కొనుగోలు చేయడానికి అవినీతి చేస్తే.. ఆ అవినీతి సొమ్ము ఖర్చుచేస్తే నువ్వు గెలవవు అని సలహా ఇస్తున్నా
 • చంద్రబాబు చేస్తున్న అన్యాయాలు ఎంతటి దారుణంగా ఉన్నాయో మనమంతా చూస్తున్నాం
ముద్రగడ చేసిన తప్పేంటి..
 • కొద్దిరోజుల క్రితం చూశాం.. ముద్రగడ పద్మనాభం దీక్ష చేస్తుంటే, ఆ దీక్షను భగ్నం చేయడం, ఆయన భార్యను, కొడుకును కొట్టుకుంటూ ఈడ్చుకుంటూ పోవడం అందరం చూశాం
 • ఇదే చంద్రబాబును అడుగుతున్నా.. ముద్రగడ పద్మనాభం చేసిన తప్పేంటి
 • నువ్వు  ఎన్నికల్లో ఇచ్చిన హామీని నెరవేర్చాలని నిరాహార దీక్ష చేస్తే.. ఆ వ్యక్తిని ఇలా శిక్షించడం సరైనదేనా
 • తనకు నచ్చని వ్యక్తి ఎవరైనా ఏదైనా చేస్తే దొంగకేసులు పెట్టాల్సిందే
 • నీచమైన రాజకీయాలకు పాల్పడుతున్నారు
 • పోలీస్ టెర్రరిజాన్ని చూస్తున్నాం
 • పోలీసువారూ, ఈవాళ అధికారం చంద్రబాబుది కావచ్చు కానీ అది ఎల్లకాలం ఉండదు
 • జీతాలు ఇచ్చేది చంద్రబాబు అత్తగారి సొత్తు కాదు
 • మీ టోపీ మీద ఉన్న మూడు సింహాలను గౌరవించండి
 • అధికారం ఎల్లకాలం ఒకరిది కాదు
 • మనం ప్రజల దగ్గర జీతం తీసుకుంటున్నాం.. వాళ్లకు న్యాయం చేయాలని కోరుతున్నాగడప గడపకూ వైఎస్ఆర్
 • గడపగడపకూ వైఎస్ఆర్ అన్న గొప్ప కార్యక్రమానికి శ్రీకారం పలుకుతున్నా
 • రాజకీయాలలో చాలాచోట్ల ఎమ్మెల్యేలు కావాలని, పైకి రావాలని చాలామంది అనుకుంటారు
 • ఉత్సాహవంతులుంటారు... ఆ ఉత్సాహాన్ని నేను సపోర్ట్ చేస్తా
 • రాజకీయాలలో గెలవడానికి ఒక సీక్రెట్ చెబుతా
 • వాళ్ల వెనక పెద్దపెద్ద ఎమ్మెల్యేలు ఉండాల్సిన అవసరం లేదు, వారసత్వం అసలే అక్కర్లేదు
 • గెలవాలంటే గడపగడపకూ వైఎస్ఆర్ కార్యక్రమం చేపట్టాలి
 • ఈ కరపత్రం ప్రతి వైఎస్ఆర్ కాంగ్రెస్ ఆశావహులకు, సమన్వయకర్తలకు ఇస్తాం
 • చంద్రబాబు చేసిన అన్యాయాలు, ఆయన ఇచ్చిన మాటలు, ఆయన ఏం చెప్పాడో ఇందులో కోట్ చేశాం
 • రాజకీయ వ్యవస్థ మార్పులకు నాంది పలకాలన్న నా మాటలున్నాయి
 • వంద ప్రశ్నలు ఇచ్చి, చంద్రబాబుకు మార్కులు వేయాలని కోరుతున్నాం
 • మీరు ప్రజల వద్దకు వెళ్లి.. ప్రతి ఇంటికీ వెళ్లి మన ఎమ్మెల్యే కావాలనుకున్న వ్యక్తి ప్రతి ఇంటికీ వెళ్లండి
 • ఐదు నెలల్లో ప్రతి గ్రామంలో ప్రతి ఇల్లూ తిరగండి
 • ఈ పాంప్లెట్ పంచి, ప్రజలచేత చంద్రబాబుకు మార్కులు వేయించండి
 • వాళ్లు మార్కులు వేయడం మొదలుపెడితే వందకు ఆయనకు వచ్చే మార్కులు సున్నా అని తెలిస్తే ప్రజలే ఆయనను బంగాళాఖాతంలో కలుపుతారు
 • సమయం ఉంది కాబట్టి ప్రతి ఇంట్లో కనీసం రెండు మూడు నిమిషాలు గడపండి
 • వాళ్ల ఆశీస్సులు తీసుకోండి.. వారి యోగక్షేమాలు అడిగి తెలుసుకోండి
 • ప్రతి కోఆర్డినేటర్ ప్రతి ఇంటికీ వెళ్లినప్పుడు గ్రామంలో ప్రతి ఇల్లూ తిరిగితే గ్రామం మీద అవగాహన వస్తుంది
 • ఎవరు మన పార్టీతో పాటు నడుస్తున్నారు, ఎవరు ఉత్సాహంగా మనతో ఉన్నారన్నది అర్థం అవుతుంది
 • అప్పుడు ఆ గ్రామం అయిపోయిన తర్వాత బయటకు వచ్చేసరికి బూత్ కమిటీ నియమించండి
 • మీతోపాటు ఉత్సాహంగా నడిచిన వ్యక్తులను ఆ కమిటీలలో నియమించండి
 • రోజుకు చేయవలసింది కేవలం ఒక పంచాయతీ.. నాలుగు గంటలు కష్టపడండి
 • సాయంత్రం పూట ప్రజలంతా ఇళ్లలో ఉన్నారనుకున్నప్పుడు వెళ్లండి
 • ఐదు నెలల్లో నియోజకవర్గంలోని ప్రతి ఇల్లు మీరు తిరిగినట్లు అవుతుంది
 • మీ వెనక ఎవరూ ఉండాల్సిన పనిలేదు.. ఈ ఐదు నెలల తర్వాత మీరే లీడర్ అవ్వకపోతే నన్నడగండి
 • రామచంద్రారెడ్డి సీనియర్ మోస్ట్ ఎమ్మెల్యే, ఆయన ఎప్పుడూ ఓడలేదు
 • ఇప్పటికే ఆయన రెండుసార్లు తిరిగేశారు.. ఇలా ప్రజలతో మమేకం అయిపోతే ఏ ఎమ్మెల్యే ఎప్పటికీ ఓడిపోరు
 • ఈ కార్యక్రమం నిజంగా ఇప్పటికే చాలామంది ఎమ్మెల్యేలు చేశారు
 • తమకు మేలు చేస్తారని నమ్మకం ఉన్న నాయకులకే ప్రజలు ఓట్లు వేస్తారు
 • ఐదు నెలల్లో ప్రతి గ్రామంలో బూత్ కమిటీలు ఏర్పడతాయి
 • పాంప్లెట్‌లో కో-ఆర్డినేటర్ ఫొటో పెట్టుకునేదానికి కూడా స్థలం ఉంది
 • నియోజకవర్గ సమస్యలపై మీరు ఏమైనా పాంప్లెట్ వేస్తే అది కూడా వేసి తీసుకెళ్లండి
 • జూలై 8న వైఎస్ఆర్ జయంతి.. ఆరోజునే గడప గడపకూ వైఎస్ఆర్ కార్యక్రమానికి శ్రీకారం చుట్టండి
 • తిరిగామంటే తిరిగాం అన్నది కాదు.. ప్రతి ఇంటికీ క్వాలిటీ టైమ్ ఇవ్వాలి
 • గ్రామంలో అందరినీ ఒక చోటుకు రప్పించి మాట్లాడి వెళ్లిపోతే జరిగేది నష్టమే
 • ఇళ్లకు వెళ్తే వాళ్ల ఆశీస్సులు మనకు లభిస్తాయి
 • ఆ ఊళ్లో, ఆ సందులో ఏ సమస్య ఉందన్న విషయం కూడా పూర్తిగా అవగాహన అవుతుంది
 • రెండేళ్లలో చంద్రబాబు చేసిన దోపిడీ ఎంత దారుణంగా ఉందో పుస్తకాలు వేశాం
 • ఈ పుస్తకంలో ప్రతి అంశం కార్యకర్తలందరికీ తెలియాలి
 • ఇంతకుముందు నాయకులు పలు అంశాలమీద మాట్లాడారు, తీర్మానాలు చేశారు
 • బాధ కలిగించే అంశాలు రెండు మూడున్నాయి
 • రాష్ట్రాన్ని పణంగా పెట్టి ప్రత్యేక హోదాను మంటగలిపారు
 • తన మంత్రులు కేంద్రంలో ఉన్నా.. వాళ్లను ఉపసంహరించే పరిస్థితి లేదు
 • ప్రత్యేక హోదా ఇవ్వకపోతే వారిని ఉపసంహరించుకుంటా అనే దమ్ము, ధైర్యం లేవు
 • ఎందుకంటే కారణం.. ఈ పుస్తకం. ఇందులోని అంశాలన్నింటిపై సీబీఐ విచారణ వేసి, మోదీ గారు జైల్లో పెడతారేమోనని భయం
 • కృష్ణా, గోదావరి నదుల మీద కేసీఆర్ అడ్డగోలుగా ప్రాజెక్టులు కడుతున్నా అడిగే పరిస్థితి లేదు
 • దానికి కారణం కూడా మళ్లీ ఈ పుస్తకమే
 • మన పోరాటంలో చంద్రబాబు చేతకానితనం, మోసాలు అన్నింటినీ ప్రజల వద్దకు తీసుకెళ్లాలి
 • ప్రజలకు అండగా ఉండాలని సవినయంగా అందరినీ కోరుకుంటున్నా
 • దూరం నుంచి వచ్చిన ప్రతి ఒక్కరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు
ముద్రగడ దీక్షకు సంఘీభావంగానే...
 • కాపుల రిజర్వేషన్ల కోసం ముద్రగడ పద్మనాభం చేపట్టిన నిరాహారదీక్షకు సంఘీభావం తెలుపుతున్నాం
 • నా పోలవరం పర్యటన ఆ కార్యక్రమాన్ని డీవియేట్ చేయకూడదని వాయిదా వేస్తున్నాం
 • జూలై మొదటివారంలో అక్కడకు తప్పనిసరిగా వస్తానని చెబుతున్నా
 • ఇప్పుడు రాలేకపోతున్నందుకు హృదయపూర్వకంగా క్షమించాలని కోరుతున్నాం
Share this article :

0 comments: