వైఎస్ జగన్ ఏం తప్పు మాట్లాడారని?: బొత్స - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » వైఎస్ జగన్ ఏం తప్పు మాట్లాడారని?: బొత్స

వైఎస్ జగన్ ఏం తప్పు మాట్లాడారని?: బొత్స

Written By news on Friday, June 3, 2016 | 6/03/2016


వైఎస్ జగన్ ఏం తప్పు మాట్లాడారని?: బొత్స
హైదరాబాద్ : రాష్ట్రంలో ప్రజలు బాధలు పడుతుంటే టీడీపీ నేతలు మాత్రం విదేశీ పర్యటనలు చేస్తున్నారని వైఎస్ఆర్ సీపీ సీనియర్ నేత బొత్స సత్యనారాయణ మండిపడ్డారు. రైతులు, డ్వాక్రా మహిళలను మోసం చేశారని అన్నారు. రాజధాని భూములను బినామీలకు అమ్ముతున్నారని బొత్స అన్నారు. ఆయన శుక్రవారం పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ టీడీపీ నేతలు సిగ్గులేకుండా మాట్లాడుతున్నారని, వారి మానసిక స్థితి బాగుందా? లేదా అన్నారు.
ప్రజల అభిప్రాయమే వైఎస్ జగన్ చెప్పారని, ప్రభుత్వ అవినీతిపై ప్రజలు కడుపు మంటతో ఉన్నారన్నారు. ఎన్టీఆర్ పైనే చెప్పులు వేయించిన ఘనత చంద్రబాబుదని, వైఎస్ జగన్ అన్న మాటలపై అంత ఉలికిపాటు ఎందుకని బొత్స అన్నారు.  ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నిస్తే తట్టుకోలేకపోతున్నారన్నారు.  వైఎస్ జగన్ ఏం తప్పు మాట్లాడరని, అడ్డుఅదుపు లేకుండా మాట్లాడుతున్నారని అన్నారు. వైఎస్ జగన్ పై ఆరోపణలు చేస్తున్న యనమల రామకృష్ణుడి మానసిక స్థితి బాగుందా అని ఆయన సూటిగా ప్రశ్నించారు. ఏపీ ఖజానా ఖాళీగా ఉందని చెబుతున్నారని, మరి అభివృద్ధి ఎలా సాధ్యమన్నారు.

రాజ్యసభ సీటును అమ్ముకున్నారని ఆ పార్టీ నేతలు పుష్పరాజ్, కేఈ ప్రభాకర్ లు నిలదీయలేదా అని బొత్స ప్రశ్నించారు. రాజ్యసభ ఎన్నికలను కూడా వ్యాపార దృష్టితో చూస్తున్నారని, స్వయంగా టీడీపీ సీనియర్ నేతలే వ్యాఖ్యానిస్తున్నారన్నారు. బాబు వస్తే జాబు వస్తుందని అనుకుంటే నిరుద్యోగులను మోసం చేశారన్నారు. ఎగువ రాష్ట్రాల్లో ప్రాజెక్టులు కడుతుంటే టీడీపీ నేతలు మాట్లాడం లేదన్నారు. వారికి వ్యవస్థలపై గౌరవం లేదని బొత్స వ్యాఖ్యానించారు. అన్నారు.
ఇక కేంద్రమంత్రి అశోక్ గజపతి రాజు పేషీ నుంచి ఫోన్స్ కాల్స్ పై ఏం బాధ్యత వహించారని ఆయన ఈ సందర్భంగా ప్రశ్నించారు. అశోక్ గజపతిరాజుపై సీబీఐ విచారణను ఎందుకు అడగటం లేదన్నారు. ఆయన ఓఎస్డీ అప్పారావు, లోకేశ్ ల మధ్య ఉన్న లాలూచీ ఏంటని ప్రశ్నించారు. ఈ వ్యవహారాన్ని కప్పిపుచ్చడానికే వైఎస్ జగన్ పై వ్యక్తిగత దూషణలు చేస్తున్నారని బొత్స అన్నారు.
Share this article :

0 comments: