హైదరాబాద్: తెలంగాణలో విద్యుత్, ఆర్టీసీ చార్జీల పెంపు నిర్ణయాన్ని సీఎం కేసీఆర్ తక్షణమే ఉపసంహరించుకోవాలని టీ వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు గట్టు శ్రీకాంత్ రెడ్డి డిమాండ్ చేశారు. హైదరాబాద్ లో గురువారం ఆయన మాట్లాడుతూ...ప్రజలపై భారం మోపే కార్యక్రమాలకు కేసీఆర్ సర్కార్ శ్రీకారం చుట్టడం దారుణమన్నారు.
ఇప్పటికే విద్యుత్, ఆర్టీసీ చార్జీల పెంపునకు రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. వంద యూనిట్ల కంటే ఎక్కువ వాడే గృహ వినియోగదారులకు చార్జీల పెంపు, ఆర్టీసీలో 30 కి.మీ.పైన ఎంత దూరమైనా రూ.2 పెంచడంతో పాటు మిగతా బస్సుల్లో పది శాతం మేర చార్జీలు పెంచనుంది. దీనిపై గురువారం అధికారక ఉత్తర్వులు వెలువడే అవకాశముంది.

0 comments:
Post a Comment