చేసిన అభివృద్ధి ఏమీలేకే జగన్‌ను ఆడిపోసుకుంటున్నారు - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » చేసిన అభివృద్ధి ఏమీలేకే జగన్‌ను ఆడిపోసుకుంటున్నారు

చేసిన అభివృద్ధి ఏమీలేకే జగన్‌ను ఆడిపోసుకుంటున్నారు

Written By news on Friday, June 10, 2016 | 6/10/2016


చేసిన అభివృద్ధి ఏమీలేకే జగన్‌ను ఆడిపోసుకుంటున్నారు
వైఎస్సార్‌సీపీ అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ ధ్వజం
జగన్‌ను తిట్టేందుకే ప్రభుత్వ ఖర్చులతో కడపలో మహాసంకల్పం

సాక్షి, హైదరాబాద్: తమ రెండేళ్ల పాలన గురించి ప్రజలకు గొప్ప చెప్పుకోవడానికి చేసిందీ ఒక్కటీ కనిపించక సీఎం చంద్రబాబుసహా టీడీపీ నేతలందరూ ప్రభుత్వ వైఫల్యాల్ని కప్పిపుచ్చుకోవడానికిప్రతి విషయంలోనూ జగన్‌మోహన్‌రెడ్డిని ఆడిపోసుకోవడమే పనిగా పెట్టుకున్నారని వైఎస్సార్‌సీపీ అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ ధ్వజమెత్తారు. ఆమె గురువారం హైదరాబాద్‌లో విలేకరులతో మాట్లాడుతూ.. ప్రభుత్వ డబ్బులతో కడపలో మహాసంకల్ప దీక్ష నిర్వహించింది రెండేళ్ల పాలనలో సాధించిన విషయాలు చెప్పుకోవడానికా?
లేదంటే జగన్‌ను ఆడిపోసుకోవడానికా? అని ప్రశ్నించారు. ప్రభుత్వ కార్యక్రమాన్ని పూర్తిగా పార్టీ కార్యక్రమం మాదిరి నిర్వహించారని దుయ్యబట్టారు. రెండేళ్ల పాల నలో ప్రభుత్వం సాధిం చిన అభివృద్ధి ఏంటన్నది చెప్పుకోవడానికి ఒక్క అంశమైనా ఉందా? అని ప్రశ్నించారు. తుని ఘటనసహా ప్రతి విషయంలోనూ సీమ రౌడీలంటూ నిత్యం ఆ ప్రాంత ప్రజలపై  బాబు ద్వేషం వెళ్లగక్కుతున్న మాట నిజంకాదా? అని నిలదీశారు.
‘బ్రీఫ్డ్ మీ’ టేపుల్లో దొరికినందుకే  కేసీఆర్ అంటే భయం
ప్రధాని మోదీ, తెలంగాణ సీఎం కేసీఆర్‌కు తానెందుకు భయపడతానని బాబు మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తున్నారు కానీ, తాను భయపడట్లేదని కూడా ధైర్యంగా చెప్పుకోలేకపోతున్నారని పద్మ ఎద్దేవా చేశారు. ‘బ్రీఫ్డ్ మీ’ అంటూ ఆడియో టేపుల్లో దొరికిపోయారు కాబట్టే మోదీ అన్నా, కేసీఆర్ అన్నా భయమని... అందువల్లే కృష్ణానదిపై టీ సర్కారు అనుమతుల్లేకుండా ప్రాజెక్టుల నిర్మాణం చేపట్టినా ప్రశ్నించలేని పరిస్థితిలో ఉన్నారని ధ్వజమెత్తారు.
Share this article :

0 comments: