ప్రతిపక్ష నేత దిష్టిబొమ్మ దహనం సిగ్గుచేటు - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » ప్రతిపక్ష నేత దిష్టిబొమ్మ దహనం సిగ్గుచేటు

ప్రతిపక్ష నేత దిష్టిబొమ్మ దహనం సిగ్గుచేటు

Written By news on Sunday, June 5, 2016 | 6/05/2016


ప్రతిపక్ష నేత దిష్టిబొమ్మ దహనం సిగ్గుచేటు
వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు గౌరు వెంకటరెడ్డి

కర్నూలు (ఓల్డ్‌సిటీ): టీడీపీ నాయకులు అధికార పక్షంలో ఉండి ప్రతిపక్ష నేత దిష్టిబొమ్మను దహనం చేయడం సిగ్గుచేటైన విషయమని వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు గౌరు వెంకటరెడ్డి తెలిపారు. ఈ మేరకు శనివారం ఒక పత్రికా ప్రకటన విడుదల చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబును ఉద్దేశించి ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అనంతపురంలో చేసిన వ్యాఖ్యలకు నిరసనగా విజయవాడలో టీడీపీ నాయకులు దిష్టిబొమ్మ దహనం చేయడాన్ని ఆయన ఖండించారు. అధికార పార్టీ నాయకుల దిష్టిబొమ్మలు దహనం చేసి నిరసన వ్యక్తం చేయడం సహజమని, ఒక ప్రతిపక్ష నేత దిష్టిబొమ్మను దహనం చేయాలిసన అవసరం ఏమిటని ప్రశ్నించా రు. ఇది పూర్తిగా ప్రజావ్యతిరేక చర్యగా అభివర్ణించారు.
Share this article :

0 comments: