నేను.. బాబు చూడటానికి అంత బాగుండం - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » నేను.. బాబు చూడటానికి అంత బాగుండం

నేను.. బాబు చూడటానికి అంత బాగుండం

Written By news on Monday, June 6, 2016 | 6/06/2016


'నేను.. బాబు చూడటానికి అంత బాగుండం'
హైదరాబాద్: మైక్రోసాప్ట్ సీఈవో సత్యా నాదెళ్ల  ఉద్యోగంపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వ్యాఖ్యలు హాస్యాస్పదంగా ఉన్నాయని వైస్ఆర్ సీపీ ఎమ్మెల్యే బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి అన్నారు. ఆయన సోమవారం పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ ఐటీపై చంద్రబాబు వ్యాఖ్యలు ఆశ్చర్యకరంగా ఉందన్నారు. ఐటీ రంగాన్ని తానే అభివృద్ధి చేశానని చంద్రబాబు ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారన్నారు. ఇంకా ఏం మాట్లాడారంటే..
 
మేమిద్దరం చూడటానికి అంత బాగుండం..
'చంద్రబాబు సీఎం గా ఉన్న సమయంలోనే కర్నాటక ముఖ్యమంత్రిగా నిజాయితీపరుడైన జేహెచ్ పటేల్ ఉండేవారు. ఆయన దగ్గరకు వెళ్లిన కొందరు చంద్రబాబు మనల్ని ఓవర్ టేక్ చేస్తూ వెళుతున్నారని తరచూ చెప్పేవాళ్లట. ఆయన అదంతా వినీ వినీ విసుగు చెంది.. ఈ రోజు చంద్రబాబును చూసి గానీ, నన్ను చూసి గానీ ఎవరూ ఇక్కడ ఐటీ సంస్థలు స్థాపించడం లేదు. వాళ్లకు కావల్సిన మానవ వనరులు ఇక్కడ ఉన్నాయి. అంతే కాకుండా ఇన్ఫోసిస్, టీసీఎస్, విప్రో వంటి సంస్థలు స్థాపించి ఉన్నాయి. ఐటీ అభివృద్ది చెందడానికి కావల్సిన మంచి వాతావరణం ఉంది కాబట్టే సంస్థలు వచ్చాయి. మమ్మల్ని చూసి మాత్రం సంస్థలు రాలేదు, మేమిద్దరం కూడా చూడటానికి అంత బాగుండం...అని వాళ్లతో చెప్పారట'
 
ఐటీ అంటే ఇన్ కమ్ ట్యాక్స్ అని మత్రమే బాబుకు తెలుసు
'ఐటీ అనేది తానే కనిపెట్టారని, ప్రపంచానికే ఆ పదాన్ని తానే పరిచయం చేశారని చంద్రబాబు తరచూ చెబుతుంటారు.1990 కాలంనాటికి ఐటీ అంటే ఇన్ కమ్ ట్యాక్స్ అని మాత్రమే చంద్రబాబుకు తెలిసి ఉంటుందని మేము అనుకుంటున్నాం' అని బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి అన్నారు.

చంద్రబాబు హయాంలోనే మూడు నుంచి ఐదో స్థానానికి
'వాస్తవాలను పరిశీలిస్తే..ఈ రోజు భారత్ లో ఐటీ రంగానికి బెంగళూరు 38 శాతం వాటాను, తమిళనాడు 14 శాతం, ఢిల్లీ 14 శాతం, బాంబే- పూణే 16 శాతం అయితే ఆంధ్రప్రదేశ్ 8 శాతం మాత్రమే ఐటీ రంగంలో వాటా ఉందని తెలిపారు. ప్రపంచానికే  ఐటీ నేర్పించానని చెప్పుకునే చంద్రబాబు సీఎం అయినప్పుడు మూడో స్థానంలో ఉన్న ఏపీ, సీఎంగా దిగిపోయే నాటికి ఐదో స్థానానికి పడిపోయిన విషయం వాస్తవం కాదా.  ఐటీరంగ వాటాలో 8 శాతం ఉన్న ఏపీ ప్రపంచానికే ఐటీ నేర్పించామని చెప్పుకుంటే 38 శాతం ఉన్న బెంగళూరు వాళ్లు ఏమని చెప్పుకోవాలి.' అని ధ్వజమెత్తారు.

ఏపీని మించి బెంగళూరు ఎలా అభివృద్ధి చెందిందటే..
బెంగళూరు ఏందుకు అంచెలంచెలుగా ఐటీ రంగంలో అభివృద్ధిచెందిందో ఆయన వివరించారు. 'కర్నాటక నుంచి తామే ఐటీ రంగం స్థాపించాము అని ఎవరైనా చెప్పడం మనం విన్నామా?.. ఆ రోజు ఐటీ స్థాపించినప్పుడు.. బెంగళూరులో ప్రభుత్వ రంగ సంస్థలైన ఆర్టీసీ, ఎలక్ట్రిసిటీ బోర్డువంటి వాటితో పాటూ వందలాది కంపెనీలు కంప్యూరైజేషన్ లో భాగంగా సాఫ్ట్ వేర్ రంగ అభివృద్ధిలో పాలుపంచుకున్నాయి. కానీ ఇక్కడ మాత్రం చిన్న చిన్న యూనిట్లను కలిపి పెద్ద యూనిట్ గా మార్చి చంద్రబాబుకు నచ్చిన వాళ్లకు మాత్రమే ఇచ్చారు. ప్రస్తుతం పట్టిసీమ టెండర్లకు అనుసరిస్తున్న మాదిరిగానే ఆకాలంలోనే తనకు తెలిసిన వాళ్లకు మాత్రమే చంద్రబాబు పెద్దపీఠవేశారు. కర్నాటకలో కోటి రూపాయల పనిని ఐదుగురు చేస్తే.. ఇక్కడ ఐదు కోట్ల పనిని ఒక్కరికే అప్పజెప్పారు.' అని వివరించారు.

అవసరానికి తగ్గా వనరులుండటం వల్లే అభివృద్ధి
'పీవీ నరసింహరావు కృషి వల్ల మొదటగా సాఫ్ట్ వేర్ పార్క్ వచ్చింది. కంప్యూటర్ రంగానికి పునాదులు వంటి ఈసీఐఎల్, భారత్ ఎలక్ట్రానిక్స్, సీఎంసీలాంటి సంస్థలు అప్పటికే ఇక్కడ స్థాపించారు. దీంతో దక్షిణ భారతంలో ఐటీ ఎక్కువగా అభివృద్ధి చెందుతూ వచ్చింది. ఇంగ్లీష్ లో ప్రావీణ్యం, బీటెక్ చదివిన వారు ఎక్కువగా ఉండటంతో పాటూ ఐటీ అభివృద్ధికి కావసిన భౌగోళిక వనరులు కూడా అందుబాటులో ఉండటంతో ఐటీ అభివృద్ధి చెందింది.' అని తెలిపారు.
Share this article :

0 comments: