వైఎస్సార్ సీపీ తెలంగాణ కమిటీలో వివిధ నియామకాలు - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » వైఎస్సార్ సీపీ తెలంగాణ కమిటీలో వివిధ నియామకాలు

వైఎస్సార్ సీపీ తెలంగాణ కమిటీలో వివిధ నియామకాలు

Written By news on Wednesday, June 1, 2016 | 6/01/2016


వైఎస్సార్ సీపీ తెలంగాణ కమిటీలో వివిధ నియామకాలు
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ కమిటీకి సంబంధించి పలు నియామకాలు చేశారు. రాష్ట్ర కమిటీలో 10 మంది కార్యదర్శులు, నలుగురు సంయుక్త కార్యదర్శులకు చోటు కల్పించారు. పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆమోదంతో పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు గట్టు శ్రీకాంత్‌రెడ్డి మంగళవారం వీటిని ప్రకటించారు.
రాష్ట్ర పార్టీ కార్యదర్శులుగా ఎండీసయ్యదుద్దీన్ ముక్తార్(నిజామాబాద్),సంగాల ఇరిమియా, పూజారి సాంబయ్యగౌడ్(వరంగల్), సెగ్గెం రాజేశ్, సొల్లు అజయ్‌వర్మ(కరీంనగర్), రమా ఓబుల్‌రెడ్డి, వి.విజయప్రసాద్, కొళ్ల యాదయ్య, బనగాని రఘురామిరెడ్డి(రంగారెడ్డి), ఎండీ సాబీర్‌హుస్సేన్(ఆదిలాబాద్), సంయుక్త కార్యదర్శులుగా దుబ్బా క గోపాల్‌రెడ్డి(రంగారెడ్డి), వరాల శ్రీనివాస్, యల్లంకి రమేశ్, గాలి ప్రశాంత్‌బాబు (కరీంనగర్) నియమితులయ్యారు.
 జిల్లాల పరిశీలకులు వీరే...
రాష్ట్రంలోని 10 జిల్లాలకు సంబంధించిన జిల్లా పరిశీలకులుగా పార్టీ రాష్ట్ర నాయకులు నియమితులయ్యారు. ఖమ్మం, కరీంనగర్ జిల్లాల పరిశీలకుడిగా కె.శివకుమార్, గ్రేటర్ హైదరాబాద్ పరిశీలకుడిగా నల్లా సూర్యప్రకాశ్, ఆదిలాబాద్ పరి శీలకుడిగా జిన్నారెడ్డి మహేందర్‌రెడ్డి, నిజామాబాద్ జిల్లా పరిశీల కుడిగా నర్రా భిక్షపతి, మెదక్ పరిశీలకుడిగా కొండా రాఘవరెడ్డి, మహబూబ్‌నగర్ పరిశీలకుడిగా హెచ్‌ఏ రెహ్మాన్, వరంగల్ పరిశీలకుడిగా వేముల శేఖర్‌రెడ్డి, రంగారెడ్డి పరిశీలకుడిగా జి.రాంభూపాల్‌రెడ్డిని నియమించారు.
 మహిళా విభాగానికి అమృతాసాగర్...
పార్టీ రాష్ట్ర మహిళా విభాగం అధ్యక్షురాలిగా రంగారెడ్డి జిల్లాకు చెందిన కె.అమృతాసాగర్, రాష్ట్ర వైఎస్సార్  సేవాదళ్ అధ్యక్షుడిగా రంగారెడ్డి జిల్లాకు చెందిన బండారు వెంకటరమణ నియమితులయ్యారు. నిజామాబాద్ జిల్లా పార్టీ అధ్యక్షుడిగా నాయుడు ప్రకాశ్, కరీంనగర్ జిల్లా పార్టీ అధ్యక్షుడిగా అక్కెనపల్లి కుమార్‌ను నియమించారు. ఇదిలా ఉండగా వరంగల్ జిల్లా పార్టీ యువజన విభాగం అధ్యక్షుడిగా అప్పాము కిషన్(భూపాలపల్లి), జిల్లా రైతు విభాగం అధ్యక్షుడిగా కంధాడి అచ్చిరెడ్డి(పాలకుర్తి), జిల్లా విద్యార్థి విభాగం అధ్యక్షుడిగా మారంరెడ్డి కౌటిల్‌రెడ్డి నియమితులైనట్లు వైఎస్సార్‌సీపీ పార్టీ తెలిపింది.
Share this article :

0 comments: