ప్రభుత్వ వైఫల్యాలపై కదంతొక్కిన వైస్ఆర్ సీపీ - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » ప్రభుత్వ వైఫల్యాలపై కదంతొక్కిన వైస్ఆర్ సీపీ

ప్రభుత్వ వైఫల్యాలపై కదంతొక్కిన వైస్ఆర్ సీపీ

Written By news on Wednesday, June 8, 2016 | 6/08/2016


ప్రభుత్వ వైఫల్యాలపై కదంతొక్కిన వైస్ఆర్ సీపీ
► రాష్ట్రవ్యాప్తంగా పోలీస్‌స్టేషన్లలో ఫిర్యాదులు

హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు రెండేళ్ల పాలనలో చేసిన మోసాలపై ప్రతిపక్ష నేత, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పిలుపు మేరకు బుధవారం రాష్ట్రవ్యాప్తంగా ఉన్న పోలీస్ స్టేషన్లలో వైఎస్సార్ సీపీ నేతలు ఫిర్యాదు చేశారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఎన్నికలకు ముందు ఇచ్చిన ఏ ఒక్క హామీని నెరవేర్చకుండా ప్రజలను మోసం చేస్తున్నారని నేతలు ఆరోపించారు.

వైఎస్సార్ జిల్లా: సీఎం చంద్రబాబు మోసాలపై జిల్లా వ్యాప్తంగా ఫిర్యాదులు వెల్లువెత్తాయి. చంద్రబాబుపై కేసు నమోదు చేయాలని పులివెందులలో వైఎస్ ఎంపీ అవినాష్ రెడ్డి, వైఎస్ వివేకానందరెడ్డి, పార్టీ నేతలు స్థానిక పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. రాజంపేటలో వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు అమర్ నాథ్ రెడ్డి, కమలాపురంలో ఎమ్మెల్యే రవీంద్రనాథ్ రెడ్డి, రైల్వే కోడూరులో ఎమ్మెల్యే కొరుముట్ల శ్రీనివాసులు జమ్మలముడుగులో వైఎస్సార్ సీపీ నేత సుధీర్ రెడ్డి ఆధ్వర్యంలో పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదు చేశారు.

శ్రీకాకుళం: వైఎస్సార్ సీపీ సీనియర్ నేత తమ్మినేని సీతారాం ఆధ్వర్యంలో ఆముదాలవలస పోలీస్ స్టేషన్ లో పార్టీ నేతలు, కార్యకర్తలు ఫిర్యాదు చేశారు.

విజయనగరం: వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యేలు, నేతల నేతృత్వంలో స్థానిక పోలీస్ స్టేషన్లలో బాబు మోసాలపై చర్యలు తీసుకోవాలని కంప్లయింట్‌ చేశారు.

విశాఖపట్టణం: విశాఖ వన్ టౌన్, త్రీ టౌన్, నర్సీపట్నం, పాయకరావుపేట పోలీస్ స్టేషన్లలో వైఎస్సార్ సీపీ జిల్లా నేతలు రామకృష్ణ, గురువులు, జాన్ వెస్లీ, అమర్ నాథ్, వంశీకృష్ణ, గణేష్, గొల్ల బాబురావు ఆధ్వర్యంలో పార్టీ కార్యకర్తలు, నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొని ఫిర్యాదు చేశారు.

తూర్పుగోదావరి: చంద్రబాబు మోసాలపై జిల్లా వ్యాప్తంగా ఫిర్యాదులు వెల్లువెత్తాయి. ఈ కార్యక్రమాల్లో పెద్ద సంఖ్యలో వైఎస్సార్ సీపీ నేతలు, కార్యకర్తలు పాల్గొని ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. పి.గన్నవరం, పెద్దాపురం, సఖినేటిపల్లి, ముమ్మడివరం,అమలాపురం, కొత్తపేట, రాజమండ్రి, కడియం పోలీస్ స్టేషన్లలో నేతలు కొండేటి చిట్టిబాబు, సుబ్బారావునాయుడు,ఆలూరు కృష్ణంరాజు, గుత్తులసాయి, చిట్టబ్బాయ్, విశ్వరూప్, జగ్గిరెడ్డి, ఆదిరెడ్డి వాసు, రౌతు సూర్యప్రకాశరావు, వెంకటస్వామినాయడు ఆధ్వర్యంలో ఫిర్యాదులు చేశారు.

పశ్చిమగోదావరి: భీమవరం, నర్సాపురం పోలీస్ స్టేషన్లలో మాజీ ఎమ్మెల్యేలు గ్రంథి శ్రీనివాస్, ముదునూరి ప్రసాదరాజు ఆధ్వర్యంలో కంప్లయింట్‌ చేశారు.

కృష్ణాజిల్లా: ఎన్నికలకు ముందిచ్చిన హామీల్లో బాబు ఏ ఒక్క హామీ కూడా నెరవేర్చలేదంటూ వైఎస్ఆర్ సీపీ నేతలు జిల్లా వ్యాప్తంగా ఆందోళనలు చేపట్టారు. రెండేళ్ల చంద్రబాబు పాలనలో బాబు మోసాలపై చర్యలు తీసుకోవాలంటూ పార్టీ నగర అధ్యక్షుడు వంగవీటి రాధ నేతృత్వంలో విజయవాడ గవర్నర్‌పేట పోలీసులకు ఫిర్యాదు చేశారు. వైఎస్సార్ సీపీ గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని ఆధ్వర్యంలో వన్ టౌన్ పీఎస్ లో ఫిర్యాదు చేశారు. కైకలూరులో వైఎస్సార్ సీపీ నేత డీఎన్ ఆర్ ఫిర్యాదు చేశారు.

గుంటూరు: గుంటూరు జిల్లా వ్యాప్తంగా నేతలు చంద్రబాబుపై చర్యలు తీసుకోవాలంటూ స్థానిక పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదు చేశారు. గుంటూరు అరండల్ పేటలో లేళ్ల అప్పిరెడ్డి, ముస్తఫా, కావటి మనోహర్ నేతృత్వంలో, గురజాలలో జంగా కృష్ణమూర్తి, మంగళగిరిలో ఎమ్మెల్యే ఆర్కే, వినుకొండలో బ్రహ్మనాయుడు ఆధ్వర్యంలో ఫిర్యాదులు సమర్పించారు.

ప్రకాశం: చంద్రబాబు మోసాలపై చర్యలు తీసుకోవాలని కోరుతూ వైఎస్సార్ సీపీ నేతలు జిల్లా వ్యాప్తంగా స్థానిక పీఎస్ లలో ఫిర్యాదులు చేశారు. చీరాలలో బాలాజీ, ఒంగోలు వన్ టౌన్ లో కొప్పంప్రసాద్, వెంకట్రావు, వేణుగోపాల్ నేతృత్వంలో బాబుపై కేసులు నమోదు చేయాలని కంప్లయింట్‌ చేశారు.

నెల్లూరు: బుచ్చిరెడ్డిపాళెంలో జిల్లా అధ్యక్షుడు కాకాని గోవర్థన్ రెడ్డి, నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి ఆధ్వర్యంలో చంద్రబాబు మోసాలపై ఫిర్యాదు చేశారు.నెల్లూరు నగరంలోని నాల్గవ పోలీస్ స్టేషన్‌లో ముఖ్యమంత్రి చంద్రబాబుపై వైఎస్సార్‌సీపీ నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి కంప్లయింట్‌ చేశారు.

చిత్తూరు: ఎన్నికల సందర్భంగా ఆరొందల హామీలు ఇచ్చిన చంద్రబాబు... ఏ ఒక్కటీ అమలు చేయలేదని మాజీ ఎమ్మెల్యే భూమన కరుణాకర్‌రెడ్డి ఆరోపించారు. ఏపీ సీఎం చంద్రబాబుపై చీటింగ్‌ కేసు నమోదు చేయాలని తిరుపతిలో ఆయన ఫిర్యాదు చేశారు. బాబు మోసాలపై జిల్లా వ్యాప్తంగా వైఎస్సార్ సీపీ నేతలు పెద్ద సంఖ్యలో ఫిర్యాదులు చేశారు. మదనపల్లెలో ఎమ్మెల్యే దేశాయ్ తిప్పారెడ్డి, నగరిలో ఎమ్మెల్యే రోజా, బంగారు పాల్యెంలో ఎమ్మెల్యే డాక్టర్ సునీల్ కుమార్, పుంగనూరులో ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆధ్వర్వంలో ఫిర్యాదు చేశారు

అనంతపురం: చంద్రబాబు మోసాలపై అనంతపురం జిల్లా వ్యాప్తంగా ఉన్న పోలీస్ స్టేషన్లలో వైఎస్సార్ సీపీ నేతలు ఫిర్యాదు చేశారు. మాజీ ఎమ్మెల్యేలు గుర్నాథరెడ్డి, కాపు రామచంద్రారెడ్డి, పార్టీ నేత డాక్టర్ సిద్ధారెడ్డి ఆధ్వర్యంలో కంప్లయింట్‌ చేశారు.

కర్నూలు: కర్నూలు త్రీ టౌన్ లో ఎమ్మెల్యే గౌరు సరిత, గౌరు వెంకటరెడ్డి నేతృత్వంలో, ఆలూరులో ఎమ్మెల్యే జయరాం, బనగానపల్లెలో మాజీ మంత్రి కాటసాని రాంరెడ్డి ఆధ్వర్యంలో ఫిర్యాదు చేశారు.
Share this article :

0 comments: