పిల్లి కళ్లు, తెల్ల జుట్టు ఉంటే ఏదైనా ఇచ్చేస్తారా? - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » పిల్లి కళ్లు, తెల్ల జుట్టు ఉంటే ఏదైనా ఇచ్చేస్తారా?

పిల్లి కళ్లు, తెల్ల జుట్టు ఉంటే ఏదైనా ఇచ్చేస్తారా?

Written By news on Wednesday, July 13, 2016 | 7/13/2016


పిల్లి కళ్లు, తెల్ల జుట్టు ఉంటే ఏదైనా ఇచ్చేస్తారా?
వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేల కో-ఆర్డినేటర్ గడికోట ధ్వజం
-  సీఎం పర్యటనలపై కేంద్రం దర్యాప్తు జరపాలి

 సాక్షి, హైదరాబాద్ : రెండేళ్ల పాలనలో ముఖ్యమంత్రి చంద్రబాబు ఎన్నిసార్లు విదేశీ పర్యటనలు చేశారు? అక్కడి నుంచి ఎన్ని పెట్టుబడులు తెచ్చారు? పర్యటనలకు ఎంత ఖర్చయింది? వంటి వివరాలతో శ్వేతపత్రం విడుదల చేసి ప్రజలకు వాస్తవాలను తెలియజేయాలని వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేల కో-ఆర్డినేటర్ గడికోట శ్రీకాంత్‌రెడ్డి డిమాండ్ చేశారు. విలువైన భూములను చంద్రబాబు విదేశీ సంస్థలకు ధారాదత్తం చేస్తున్నారని మండిపడ్డారు. పిల్లి కళ్లు, తెల్ల జుట్టు, తెల్ల తోలు ఉన్న వారొచ్చి ఏమడిగినా చంద్రబాబు ఇచ్చేసేలా ఉన్నారని ఎద్దేవా చేశారు. స్వదేశీ పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించే బదులు విదేశీ కంపెనీలపైనే ఆసక్తి చూపుతున్నారని దుయ్యబట్టా రు. ఆయన మంగళవారం పార్టీ కేంద్ర కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. చంద్రబాబు విదేశీ పర్యటనపై విచారణ జరిపించాలని కేంద్రాన్ని కోరారు. బాబు ఎక్కడెక్కడికి వెళుతున్నారు? ఏం చేస్తున్నారు? ఏం తెస్తున్నారు? అనేదానిపై కేం ద్రం దర్యాప్తు చేయాల్సిన అవసరముందన్నారు.

 ‘హోదా’ ఉంటే పరిశ్రమలు వద్దన్నా వస్తాయి
 ‘‘చంద్రబాబు ఏ దేశానికి వెళితే ఆ దేశం ఆచారాల ప్రకారం ఫొటోలు తీయించుకొని అందరూ తన గురించే చర్చించుకుంటున్నారని ప్రచారం చేసుకుంటున్నారు. రాజధాని నిర్మాణాన్ని సింగపూర్‌కు అప్పగించడం చాలదన్నట్లు చైనాకు వెళ్లి ఏపీలోని 972 కిలోమీటర్ల పొడవున ఉన్న సముద్రతీరంలో ఎక్కడైనా పోర్టు నిర్మించుకోవచ్చని చంద్రబాబు చెప్పారు. రష్యాకు వెళ్లి తమ వద్ద 15 లక్షల ఎకరాల భూ బ్యాంకు ఉందని చెబుతూ వారితో ఏదో ఒక హోటల్‌లో కూర్చొని టిష్యూ పేపర్‌పై ప్రణాళికలు గీసి, పెట్టుబడులు వస్తున్నాయని ప్రచారం చేసుకోవడం చూసి రాష్ట్ర ప్రజలు నవ్వుకుంటున్నారు.

విశాఖలో జరిగిన భాగస్వామ్య సదస్సులో 48 గంటల్లోనే రూ.4.67 లక్షల కోట్ల పెట్టుబడులకు ఒప్పందాలు కుదిరాయంటూ చంద్రబాబు గొప్పగా చెప్పుకున్నారు. రూ.4.67 లక్షల కోట్ల పెట్టుబడుల్లో ఒక్క శాతమైనా రాష్ట్రానికి వచ్చాయా? ఏపీకి ప్రత్యేక హోదా కోసం చంద్రబాబు పోరాడితే పరిశ్రమలు వద్దన్నా రాష్ట్రానికి వస్తాయి. ఆ పని చేయకుండా ప్రత్యేక హోదాను నీరుగార్చి విదేశాల వెంటపడడం ఏమిటి? హోదా కోసం పోరాడటానికి అందరినీ పిలిచి చర్చిస్తే మేము హృదయపూర్వకంగా సహకరిస్తాం’’ అని శ్రీకాంత్‌రెడ్డి స్పష్టం చేశారు.  పారిశ్రామిక విధానంపై రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జీవో రైతులను భయభ్రాంతులకు గురిచేస్తోం దన్నారు. చంద్రబాబుకు పరిశ్రమలు పెట్టాలనే చిత్తశుద్ధి ఉంటే రాయలసీమలో ఉన్న వేలాది ఎకరాల భూమిని ఇవ్వొచ్చని, ఇలా చేస్తే అక్కడ పరిశ్రమలు, ఉపాధి అవకాశాలు పెరుగుతాయని చెప్పారు
Share this article :

0 comments: