రాజమండ్రి: ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్షనేత, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ ను పరామర్శించారు. మంగళవారం సాయంత్రం రాజమండ్రి ఎయిర్ పోర్టుకు చేరుకున్న వైఎస్ జగన్ కు పార్టీ నేతలు, కార్యకర్తలు ఘనస్వాగతం పలికారు. రాజమండ్రి విమానాశ్రయం నుంచి వైఎస్ జగన్ నేరుగా ఉండవల్లి నివాసానికి వెళ్లి ఆయన్ను పరామర్శించారు. కొద్ది రోజుల కిందట ఉండవల్లి అరుణ్ కుమార్ తల్లి మరణించారు.
పశ్చిమగోదావరి జిల్లాలో ఇటీవల మరణించిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత బూరుగుపల్లి చిన్నారావు కుటుంబసభ్యులను వైఎస్ జగన్ పరామర్శిస్తారు. పశ్చిమగోదావరి జిల్లాలో బుధవారం ఆయన విస్తృతంగా పర్యటించనున్నారు. రేపు ఉదయం జంగారెడ్డిగూడెంలో పొగాకు రైతులతో వైఎస్ జగన్ ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొని వారి సమస్యలను అడిగి తెలుసుకుంటారు. ఆ తర్వాత కుక్కునూరులో పోలవరం నిర్వాసితులకు సంఘీభావం తెలుపనున్నారు.

0 comments:
Post a Comment