ఎన్నికలు ఎప్పుడొచ్చినా పార్టీకే పట్టం - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » ఎన్నికలు ఎప్పుడొచ్చినా పార్టీకే పట్టం

ఎన్నికలు ఎప్పుడొచ్చినా పార్టీకే పట్టం

Written By news on Wednesday, July 27, 2016 | 7/27/2016


టీడీపీ ప్రభుత్వంపై ప్రజల్లో అసహనం
‘గిద్దలూరు’ వైఎస్సార్‌ సీపీకి కంచుకోట
ఎన్నికలు ఎప్పుడొచ్చినా  పార్టీకే పట్టం
పార్టీ నియోజకవర్గ సమన్వయకర్త ఐ.వి.రెడ్డి
జగన్‌ సీఎం కావడమే లక్ష్యం : చేగిరెడ్డి లింగారెడ్డి
కంభం: 
గిద్దలూరు నియోజకవర్గం వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీకి కంచుకోట అని, ఎన్నికలు ఎప్పుడొచ్చినా ప్రజలు తమ పార్టీకే పట్టం కడతారని ఆ పార్టీ నియోజకవర్గ సమన్వయకర్త ఐ.వి.రెడ్డి పేర్కొన్నారు. స్థానిక సీఎల్‌ఆర్‌ కాంప్లెక్స్‌ ఆవరణలో మంగళవారం పార్టీ నియోజకవర్గస్థాయి కార్యకర్తల సమావేశం  నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలుగుదేశం ప్రభుత్వంపై ప్రజల్లో నమ్మకం సన్నగిల్లిందన్నారు. వైఎస్సార్‌సీపీ తరఫున గెలిచిన అశోక్‌రెడ్డి తన ఎమ్మెల్యే పదవిని సీఎం చంద్రబాబు వద్ద తాకట్టు పెట్టారని విమర్శించారు. పార్టీ నేత చేగిరెడ్డి లింగారెడ్డి మాట్లాడుతూ నియోజకవర్గంలో పార్టీ పటిష్టతకు, సమన్వయకర్త ఐ.వి.రెడ్డికి పూర్తి మద్దతుగా నిలుస్తానన్నారు. పార్టీ అధ్యక్షుడు జగన్‌మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రి కావడమే తమ లక్ష్యమన్నారు. మార్కెట్‌ యార్డు మాజీ చైర్మన్‌ డాక్టర్‌ రంగారెడ్డి, కంభం, బేస్తవారిపేట, కొమరోలు మండల కన్వీనర్లు గొంగటి చెన్నారెడ్డి, బాలిరెడ్డి, సార్వభౌమరావు, పార్టీ సాంస్కృతిక విభాగం జిల్లా అధ్యక్షుడు కొండా తిరుపతిరెడ్డి, సెక్రటరీ ఖమర్, టీవీఎస్‌పీ శర్మ, మాజీ ఎంపీపీ వెంకటరాజు, కంభం ఎంపీటీసీ సభ్యుడు చిక్కుడు రోశయ్య, పట్టణ అధ్యక్షుడు రఫీ తదితరులు పాల్గొన్నారు.   
Share this article :

0 comments: