నిజాం గ్రౌండ్స్‌లో వైఎస్సార్‌సీపీ భారీ సభ - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » నిజాం గ్రౌండ్స్‌లో వైఎస్సార్‌సీపీ భారీ సభ

నిజాం గ్రౌండ్స్‌లో వైఎస్సార్‌సీపీ భారీ సభ

Written By news on Wednesday, July 20, 2016 | 7/20/2016


నిజాం గ్రౌండ్స్‌లో వైఎస్సార్‌సీపీ భారీ సభ
పార్టీ తెలంగాణ అధ్యక్షుడు గట్టు శ్రీకాంత్‌రెడ్డి
తెలంగాణలో పార్టీ ప్రధాన భూమిక పోషిస్తుందని వెల్లడి
 
 సాక్షి, హైదరాబాద్ : రాబోయే రోజుల్లో తెలంగాణ రాష్ట్రంలో వైఎస్సార్‌సీపీ ప్రధాన భూమిక పోషించనుందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ అధ్యక్షుడు గట్టు శ్రీకాంత్‌రెడ్డి చెప్పారు. ఆంధ్రప్రదేశ్‌లో ఐదు లక్షల ఓట్ల తేడాతో పార్టీ అధికారానికి దూరమైందని, తెలంగాణలో చాలా తక్కువ ఓట్లతో కొన్ని అసెంబ్లీ సీట్లను చేజార్చుకున్నామని, సమైక్యంగా పనిచేస్తే వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో పార్టీ ప్రధాన భూమిక పోషించే పరిస్థితులు ఏర్పడతాయని తెలిపారు. మంగళవారం లోటస్‌పాండ్‌లోని కేంద్ర కార్యాలయంలో పార్టీ గ్రేటర్ హైదరాబాద్, కరీంనగర్ జిల్లా కమిటీల సమీక్షా సమావేశం జరిగింది.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నగరంలోని 150 డివిజన్లలోనూ, రాష్ట్రంలోని అన్ని మండలాల్లోనూ త్వరగా కమిటీల ప్రక్రియ పూర్తి చేయాలని, ప్రజా సమస్యలను గుర్తించి దశలవారీగా పోరాటాలకు సిద్ధం కావాలని పార్టీ క్యాడర్‌కు సూచించారు. పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రజల మధ్యే ఉంటూ సమస్యల పరిష్కారానికి పోరాడుతున్న తీరును ఈ సందర్భంగా గుర్తుచేశారు. ఉభయ తెలుగు రాష్ట్రాల ప్రజలు మహానేత వైఎస్సార్ పాలనను చంద్రబాబు, కేసీఆర్‌ల పాలనను పోల్చి చూసుకుంటున్నారని చెప్పారు. ఇద్దరు సీఎంల పాలనను ప్రజలు అసహ్యించుకుంటున్నారన్నారు.

గ్రేటర్ హైదరాబాద్ అందరికీ గుండెకాయ లాంటిదని, ఇక్కడ 23 జిల్లాల వాసులు నివసిస్తున్నారని చెప్పారు. పార్టీ నగరంలో బలంగా ఉంటే రెండు రాష్ట్రాల్లోనూ బలంగా ఉన్నట్లేనన్నా రు. త్వరలో నిజాం కాలేజీ గ్రౌండ్స్‌లో భారీ బహిరంగ సభను నిర్వహించేందుకు సన్నద్ధమవుతున్నట్లు చెప్పారు. పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నల్లా సూర్యప్రకాశ్ మా ట్లాడుతూ పార్టీని నగరం, రాష్ట్రంలో బలోపేతం చేయాల్సిన అవసరం ఉందన్నారు. పార్టీ ప్రధాన కార్యదర్శి జెన్నారెడ్డి మహేందర్‌రెడ్డి, పార్టీ గ్రేటర్ అధ్యక్షుడు బొడ్డు సాయినాథ్‌రెడ్డి, కరీంనగర్ జిల్లా అధ్యక్షుడు ఎ.కుమార్, పార్టీ యువజన విభాగం అధ్యక్షుడు వెల్లాల రామ్మోహన్, గ్రేటర్ మహిళా విభా గం అధ్యక్షురాలు శ్యామల, నాగదేశి రవికుమార్, రైతు విభాగం అధ్యక్షుడు హనుమంతు తదితరులు పాల్గొన్నారు.
Share this article :

0 comments: