
– కాలనీలను మృత్యు కూపంగా మర్చుతున్నారు..
– ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డికి మొరపెట్టుకున్న మల్లంగుంట వాసులు
మల్లంగుంట(తిరుపతి రూరల్):
‘‘మురుగు కాలువలు లేవు...రోడ్డు వసతి లేదు...ఇంటికో మురికి గుంట ఉండడంతో దోమలు పెరిగిపోతున్నాయి...అనారోగ్యంతో ఇప్పటికే దాదాపు ఐదుగురు మృతి చెందారు...ప్రతి రోజు నరకం చూస్తున్నాం.. పంచాయతీ పాలకులు పట్టించుకోవడం లేదు..మీరైనా న్యాయం చేయండయ్యా’’...అంటూ మల్లంగుంట వాసులు ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డికి మొరపెట్టుకున్నారు.
వైఎస్సార్ సీపీ బీసీ సెల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పొట్టేలు మునస్వామియాదవ్, పార్టీ మండల అధ్యక్షుడు ఉపేంద్రరెడ్డి ఆధ్వర్యంలో గురువారం మల్లంగుంటలోని వినాయకనగర్, ప్రియదర్శిని కాలనీ, అంబేద్కర్‌కాలనీల్లో గడప గడపకూ వైఎస్సార్‌సీపీ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి గడప గడపకూ వెళ్లి స్థానికులతో ఆప్యాయంగా మాట్లాడారు. వారి సమస్యలను అడిగితెలుసుకున్నారు. ఎమ్మెల్యేనే స్వయంగా వచ్చి సమస్యల గురించి ఆరా తీయడంతో స్థానికులు తాము ఏళ్ల తరబడి ఎదుర్కొంటున్న పారిశుద్ధ్యం, తాగునీరు, వీధిలైట్లు, మురుగుకాలువల సమస్యలను ఏకరువు పెట్టారు. పంచాయతీ పాలకులు పట్టించుకోవడం లేదని ఆరోపించారు. వీధిలైట్లు అమర్చడంలో రాజకీయ వివక్షత చూపుతున్నారని మండిపడ్డారు. తాగునీరు ఐదు రోజులకు ఒకసారి కూడ రావడం లేదని వాపోయారు. అర్హత ఉన్నా ఇంటి పట్టాల ఇవ్వడం లేదని కొందరు మహిళలు ఎమ్మెల్యేకు వినతులు ఇచ్చారు. స్పందించిన ఎమ్మెల్యే పంచాయతీ కార్యదర్శితో ఫోన్ ద్వారా మాట్లాడి, సమస్యలను పరిష్కరించాలని ఆదేశించారు.
రాజన్న పాలన.. జగన్నతోనే సాధ్యం
ప్రతి ఇంటికి కనీసం రెండు సంక్షేమ పథకాలను విజయవంతంగా అమలు చేసి దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి పేదల గుండెల్లో దేవుడుగా నిలచారని వైఎస్సార్ సేవాదళ్ రాష్ట్ర అధ్యక్షుడు, చంద్రగిరి ఎమ్మెల్యే డాక్టర్ చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి పేర్కొన్నారు. రాజన్న ప్రజా సంక్షేమ పాలన వైఎస్సార్ సీపీ అధినేత జగన్‌మోహన్‌రెడ్డితోనే సాధ్యమన్నారు. ప్రస్తుతం చంద్రబాబు సాగిస్తున్న రాక్షస పాలన ఇంత వరకు చూడలేదని జనం దుమ్మెత్తి పోస్తున్నరన్నారు. వచ్చే ఎన్నికల్లో వైఎస్ జగన్ ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ జిల్లా ప్రధాన కార్యదర్శులు అజయ్‌కుమార్‌రెడ్డి, మాధవరెడ్డి, ఎస్సీ సెల్ జిల్లా ఆర్గనైజింగ్ కార్యదర్శి దారం రామస్వామి, రామచంద్రాయ్య, ఆటో రవి, ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షుడు దామినేటి కేశవులు, వీరనారాయణరెడ్డి, పీపాసీ, వెంకటరమణ, భానుప్రకాష్, మునస్వామిరెడ్డి కార్యకర్తలు పాల్గొన్నారు.
0 comments:
Post a Comment