మల్లన్నసాగర్‌పై అఖిలపక్షం ఏర్పాటు చేయండి - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » మల్లన్నసాగర్‌పై అఖిలపక్షం ఏర్పాటు చేయండి

మల్లన్నసాగర్‌పై అఖిలపక్షం ఏర్పాటు చేయండి

Written By news on Tuesday, July 26, 2016 | 7/26/2016


మల్లన్నసాగర్‌పై అఖిలపక్షం ఏర్పాటు చేయండి
వైఎస్సార్‌సీపీ తెలంగాణ అధ్యక్షుడు గట్టు డిమాండ్
 
 సాక్షి, హైదరాబాద్ : రాష్ట్ర ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే  మల్లన్నసాగర్ ప్రాజెక్టు రీ డిజైన్‌పై సీఎం ఆధ్వర్యంలో అఖిలపక్ష భేటీ ఏర్పాటు చేయాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ అధ్యక్షుడు గట్టు శ్రీకాంత్‌రెడ్డి డిమాండ్ చేశారు. అఖిలపక్షంతో చర్చిం చకుండా, ప్రజాభిప్రాయ సేకరణ చేయకుండా రాత్రికిరాత్రి డిజైన్లు మార్చ డం, జీవోలు ఇవ్వడం ఏమిటని ప్రశ్నిం చారు. నిర్వాసితులపై పోలీసుల లాఠీచార్జీని, రైతులకు మద్దతుగా నిలిచిన వైఎస్సార్‌సీపీ సహా ఇతర పార్టీల నాయకులను అరెస్ట్ చేయడాన్ని ఖండించారు. సోమవారం లోటస్‌పాండ్‌లోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు.

లాఠీలు, తూటాలతో పొలాల్లోకి నీళ్లు రావన్న విషయాన్ని ప్రభుత్వం గ్రహించాలని హితవు పలికారు. రైతులు కోరుకున్న విధంగా భూసేకరణ చట్టం-2013 లేదా జీవో 123 ప్రకారం పరిహారమిస్తామన్న సీఎం కేసీఆర్, మంత్రి హరీశ్.. అందుకు భిన్నంగా వ్యవహరిస్తున్నారని దుయ్యబట్టారు. ‘‘ప్రాజెక్టులకు మా పార్టీ పూర్తి మద్దతునిస్తుంది. అయితే నిర్వాసితులకు అన్ని ప్రయోజనాలు చేకూర్చాలి. రైతుల కుటుంబాలకు ఉద్యోగాలిచ్చి, ఉపాధి కోల్పోయిన వారికి పనులు క ల్పించాలి. ఇళ్లు, ఆర్‌ఓఆర్ ప్యాకేజీని నిర్ణీత కాల వ్యవధితో ఇచ్చేలా చర్యలు తీసుకోవాలి’’ అని డిమాండ్ చేశారు.

 గ్రామాల్లో రిజిస్ట్రేషన్ కార్యాలయాలా..?
 గ్రామాల్లో రిజిస్ట్రేషన్ కార్యాలయాలను పెట్టి రైతుల భూములను రిజిస్టర్ చేయించడాన్ని శ్రీకాంత్‌రెడ్డి తప్పుపట్టారు. రైతుకు జీవనాధారమైన పొలాన్ని లాక్కుంటూ పరిహారం అందించకపోవడం ఏం న్యాయమని ప్రశ్నించారు. దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డి చేపట్టిన జలయజ్ఞం ఫలితాలు ఇప్పుడు వస్తున్నాయన్నారు. నాడు వైఎస్ తీసుకున్న చర్యల వల్లే ఇప్పుడు మహబూబ్‌నగర్ జిల్లాలోని ప్రాజెక్టుల నుంచి నీళ్లు వస్తున్నాయని గుర్తుచేశారు. రైతన్నల కడుపు కొట్టిన ప్రభుత్వాలు ఏవీ మనలేవని, వారి ఉసురు తగులుతుందని హెచ్చరించారు. గతంలో చంద్రబాబు సర్కారు బషీర్‌బాగ్‌లో కాల్పులకు పాల్పడితే ఏమైందో గుర్తుంచుకోవాలన్నారు. నిర్వాసితుల సమస్యలు పరిష్కరించి ఆరునెలల ఆలస్యంగా ప్రాజెక్టును ప్రారంభించినా ఏమీ కాదని పేర్కొన్నారు. సీఎం సొంత జిల్లా మెదక్‌లోనే 600 మంది రైతులు ఆత్మహత్యల బారిన పడ్డారని, అయితే వారిలో కనీసం 60 మందికి కూడా పరిహారం అందించలేదన్నారు.
Share this article :

0 comments: