నేటి నుండి గడప గడపకు - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » నేటి నుండి గడప గడపకు

నేటి నుండి గడప గడపకు

Written By news on Friday, July 8, 2016 | 7/08/2016


గడపగడపకూ వైఎస్సార్
వైఎస్ జయంతి సందర్భంగా నేటి నుంచి ప్రారంభం.. ప్రజల్లోకి వైఎస్సార్‌సీపీ శ్రేణులు
♦ డిసెంబర్ 31వ తేదీ వరకూ 5 నెలల పాటు కార్యక్రమం
♦ ఇంటింటికీ నాలుగు పేజీల కరపత్రం పంపిణీ
♦ చంద్రబాబు పాలనపై వంద ప్రశ్నలతో బ్యాలట్
♦ రోజు వారీగా నివేదికలు... పర్యవేక్షణకు యంత్రాంగం
♦ వైఎస్సార్ విగ్రహానికి నివాళులర్పించి శ్రీకారం

సాక్షి, హైదరాబాద్: వైఎస్సార్ కాంగ్రెస్ ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న ‘గడప గడపకూ వైఎస్సార్...’ కార్యక్రమం నేటినుంచి ప్రారంభం కానున్నది. క్షేత్ర స్థాయిలో పార్టీ శ్రేణులు క్రియాశీకలంగా పాల్గొనేందుకు సమాయత్తం అవుతున్నాయి.

తెలుగు ప్రజల హృదయాల్లో సంక్షేమ పథకాల ప్రదాతగా నిలిచి పోయిన దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి జయంతి రోజైన జూలై 8వ తేదీన మొత్తం 13 జిల్లాల్లో ఈ కార్యక్రమాన్ని మొదలు పెట్టేందుకు వీలుగా దాదాపు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని పార్టీ వర్గాలు తెలిపాయి. జూన్ 14వ తేదీన విజయవాడలో జరిగిన పార్టీ రాష్ట్ర స్థాయి కార్యవర్గ విసృ్తత సమావేశంలో ఈ కార్యక్రమాన్ని చేపట్టాలని నిర్ణయించిన దరిమిలా ఈ నెల 4న హైదరాబాద్‌లోని పార్టీ కేంద్ర కార్యాలయంలో జరిగిన సీనియర్ నేతలు, ఎమ్మెల్యేలు, సమన్వయకర్తలతో పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సన్నాహక సమావేశం నిర్వహించారు.

పార్టీ జనాదరణను పొందడానికి, ప్రజా మద్దతు పొందడానికి ఈ కార్యక్రమం ఎంత ముఖ్యమైనదో జగన్ ఈ సమావేశంలో వివరించారు. ఆయా అసెంబ్లీ నియోజకవర్గాల్లోని ప్రతి కుగ్రామానికి, ప్రతి గడపకూ పార్టీ కార్యకర్తలు వెళ్లాలని సూచించారు. ‘గడప గడపలో ఒకే నినాదం-వైఎస్సార్ కాంగ్రెస్, ఇది తెలుగు ప్రజల నమ్మకానికి ప్రతిరూపం’ అనే శీర్షికన ముద్రించిన నాలుగు పేజీల కరపత్రాన్ని ఈ సందర్భంగా ఇంటింటికీ పంపిణీ చేస్తారు. ఈ కరపత్రంలో ఎన్నికలపుడు (2014) చంద్రబాబు చేసిన వాగ్దానాలు, వాటిని నెరవేర్చలేకపోయిన వైనం వివరించారు. అంతే కాదు, చంద్రబాబు పాలన పాసా? ఫెయిలా? ప్రజలే నిర్ణయించాలని కోరుతూ ఇదే కరపత్రంలో వంద ప్రశ్నలతో ఒక బ్యాలట్‌ను కూడా పొందుపర్చారు.

ఐదు నెలలు గడప గడపకూ...

నేటినుంచి ప్రారంభమయ్యే ఈ కార్యక్రమం డిసెంబర్ 31వ తేదీ వరకూ 5 నెలల పాటు జరగాలని పార్టీ నాయకత్వం నిర్దేశించింది. తానిచ్చిన వాగ్దానాలు నెరవేర్చలేకపోగా ఈ రెండేళ్లలో చంద్రబాబునాయుడి ప్రభుత్వం భారీ ఎత్తున అవినీతికి పాల్పడ్డం, రాజధాని పేరుతో భూదందాను నిర్వహించడం వంటి అంశాలను పార్టీ నేతలు గడప గడపకూ వెళ్లి వివరించాలనేది ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశ్యంగా ఉంది. అలాగే చంద్రబాబు ప్రభుత్వం నుంచి ప్రజలకు ఈ రెండేళ్లలో ఏదైనా మేలు జరిగిందా అనే విషయాలపై కూడా ఆరా తీస్తారు.

ప్రజల్లోకి వెళ్లడం మొదలు పెట్టిన తరువాత మూడు రోజుల కన్నా ఎక్కువ విరామం ఉండకూడదని, వివిధ కారణాల వల్ల మూడు రోజులు ఆపివేసినా నాలుగో రోజు నుంచి మళ్లీ మొదలు పెట్టాలని పార్టీ సూచించింది. రాజధాని నిర్మాణం మొదలు, సదావర్తి భూముల అమ్మకం కుంభకోణం వరకూ భారీగా అవినీతికి పాల్పడుతున్న చంద్రబాబు వచ్చే ఎన్నికల్లో డబ్బును కుమ్మరించే వ్యూహంతో ముందుకు వస్తారని దీనిని సమర్థవంతంగా తిప్పి కొట్టాలంటే  నిరంతరం ప్రజలతో మమేకమై వారి ఆదరణ చూరగొనడం ఒక్కటే పరిష్కారమని పార్టీ దృఢంగా విశ్వసిస్తోంది.

ఈ అంశాల నేపథ్యంలో ఆయా జిల్లాల్లో గడప గడపకూ... కార్యక్రమం ఎలా జరుగుతుందో తెలుసుకోవడానికి రోజు వారీగా నివేదికలు తెప్పించుకునే ఏర్పాట్లను కూడా చేసుకుంది. రాష్ట్ర స్థాయిలోనూ, జిల్లా స్థాయిల్లోనూ కార్యక్రమ పర్యవేక్షణకు యంత్రాంగం ఇప్పటికే ఏర్పాటైంది. గడప గడపకూ పంపిణీ చేయాల్సిన కరపత్రాలు కూడా అన్ని జిల్లాలకూ పార్టీ ఇప్పటికే చేరవేసింది. వైఎస్సార్ జయంతిని పురస్కరించుకుని తొలుత ఆయన విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించిన అనంతరం పార్టీ జెండాను ఎగుర వేసిన అనంతరం గడప గడపకూ కార్యక్రమానికి శ్రీకారం చుట్టాలని పార్టీ నిర్దేశించింది.
Share this article :

0 comments: