టీడీపీ విధానాలు నచ్చక తిరిగొచ్చా.. - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » టీడీపీ విధానాలు నచ్చక తిరిగొచ్చా..

టీడీపీ విధానాలు నచ్చక తిరిగొచ్చా..

Written By news on Sunday, July 31, 2016 | 7/31/2016


టీడీపీ విధానాలు నచ్చక తిరిగొచ్చా..
ఏఎస్‌పేట జెడ్పీటీసీ సభ్యురాలు హజరత్తమ్మ

అనుమసముద్రంపేట:శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా ఏఎస్‌పేట జెడ్పీటీసీ సభ్యురాలు కుదారి హజరత్తమ్మ శనివారం ఆత్మకూరు ఎమ్మెల్యే మేకపాటి గౌతమ్‌రెడ్డి సమక్షంలో తిరిగి వైఎస్సార్ సీపీలో చేరారు. ఏఎస్‌పేట ఎంపీడీవో కార్యాలయం వద్ద ఆమెకు ఎమ్మెల్యే గౌతమ్‌రెడ్డి, పార్టీ మండల కన్వీనర్ పం దిళ్లపల్లి సుబ్బారెడ్డి, మండల మహిళా కన్వీనర్ బోయిళ్ల పద్మజారెడ్డి పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా హజరత్తమ్మ విలేకరులతో మాట్లాడుతూ తనకు రాజకీయ భిక్ష పెట్టి సమాజంలో గౌరవ ప్రతిష్టలు కల్పించిన కన్నతల్లిలాంటి వైఎస్సార్ సీపీని వీడానని, నెలరోజులుగా మనోవేదనకు గురయ్యానని చెప్పారు.

అధికార పార్టీలో ఉంటే ప్రజలకు సేవ చేయవచ్చని ఆ పార్టీ నాయకులు చెబితే వెళ్లానని, అయితే అక్కడ ప్రజలకు సేవచేసే విధానం కనిపించడం లేదని పేర్కొన్నారు.  తనను నమ్మి ఓట్లేసి గెలిపించిన ఓటర్ల ఆశలు వమ్ము చేయకూడదని నిర్ధారించుకుని వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి చేసే ప్రజా పోరాటాలకు మద్దతు పలికి  ప్రజా సమస్యలు పరిష్కరించాలన్న  నిర్ణయంతో తిరిగి సొంతగూటికి వచ్చినట్లు చెప్పారు.
Share this article :

0 comments: