ఇన్నాళ్ల తర్వాత సాంకేతిక కారణాలా? - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » ఇన్నాళ్ల తర్వాత సాంకేతిక కారణాలా?

ఇన్నాళ్ల తర్వాత సాంకేతిక కారణాలా?

Written By news on Sunday, July 3, 2016 | 7/03/2016


ఇన్నాళ్ల తర్వాత సాంకేతిక కారణాలా?
- స్పీకర్ నిర్ణయం సరికాదు: పీఏసీ చైర్మన్ బుగ్గన
- సుప్రీంకు సమాధానం చెప్పాల్సి వస్తుందనే హడావుడి నిర్ణయం

 సాక్షి, హైదరాబాద్:వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి టీడీపీలోకి ఫిరాయించిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటుకు సంబంధించిన ఫిర్యాదులను ఏపీ అసెంబ్లీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు తిరస్కరించడం ఎంత మాత్రం సరికాదని వైఎస్‌ఆర్‌సీపీ ఎమ్మెల్యే, పీఏసీ చైర్మన్ బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి విమర్శించారు. శనివారం స్పీకర్ తన నిర్ణయాన్ని ప్రకటించిన తర్వాత ఆయన ‘సాక్షి’తో మాట్లాడుతూ ఒక పార్టీ నుంచి ఎన్నికైన ఎమ్మెల్యేలు మరో పార్టీలోకి ఫిరాయించిన విషయాన్నే (ఎసెన్స్‌ను) ఈ వ్యవహారంలో పరిగణనలోకి తీసుకోవాలి తప్ప సాంకేతిక కారణాలు కాదన్నారు.పార్టీ మారిన 13 మంది ఎమ్మెల్యేలు భూమా నాగిరెడ్డి, భూమా అఖిలప్రియ, సి.ఆదినారాయణరెడ్డి, జలీల్‌ఖాన్, తిరువీధి జయరాములు, పాలపర్తి డేవిడ్‌రాజు, మణిగాంధీ, కలమట వెంకట రమణమూర్తి, పాశం సునీల్‌కుమార్, జ్యోతుల నెహ్రూ, వరుపుల సుబ్బారావు, రావు సుజయ్‌కృష్ణ రంగారావు, అత్తారు చాంద్‌బాషల అనర్హతపై ఇచ్చిన ఒక సెట్ పిటిషన్లను సాంకేతిక కారణాలతో తిరస్కరించిన స్పీకర్.. అదే ఎమ్మెల్యేలపై మరో విడత అందజేసిన పిటిషన్లపై నిర్ణయం తీసుకోకుండా  పెండింగ్‌లో ఎందుకుం చారని ప్రశ్నించారు.

 సుప్రీంకోర్టుకు భయపడే..
 తమ పార్లమెంటరీ పార్టీ నేత మేకపాటి రాజమోహన్‌రెడ్డి సుప్రీంకోర్టులో ఎమ్మెల్యేల అనర్హతకు సంబంధించి వేసిన పిటిషన్ ఈ నెల 8న విచారణకు వస్తుందనీ దీనిపై సమాధానం చెప్పాల్సి వస్తుందనే  స్పీకర్ హడావుడిగా పిటిషన్లను తిరస్కరించారన్నారు. అని ప్రశ్నించారు. ఎమ్మెల్యేల అనర్హత కేసులపై గతంలో కూడా సుప్రీంకోర్టు విచారణ జరిపిందని, ఖ్వాసీ న్యాయమూర్తిగా పాక్షిక న్యాయాధికారాలున్న స్పీకర్.. న్యాయ పరమైన విధానాలకు లోబడే వ్యవహరించాలని పేర్కొన్న విషయాన్ని ఆయన గుర్తు చేశారు.  పెండింగ్‌లో ఉన్న పిటిషన్లపై స్పీకర్ నిష్పాక్షికంగా నిర్ణయం తీసుకోవాలని కోరారు.
Share this article :

0 comments: