ఆలయాలను కూల్చివేయడం దారుణం - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » ఆలయాలను కూల్చివేయడం దారుణం

ఆలయాలను కూల్చివేయడం దారుణం

Written By news on Monday, July 4, 2016 | 7/04/2016


తిరుపతి: విజయవాడలో ఆలయాలను కూల్చివేయడం దారుణమని వైఎస్‌ఆర్‌సీపీ సీనియర్‌ నేత పెద్దిరెడ్డి రాంచంద్రారెడ్డి విమర్శించారు. హిందువుల మనోభావాలను ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం దెబ్బతీసిందని మండిపడ్డారు. సోమవారం ఆయన తిరుపతిలో విలేకరులతో మాట్లాడారు.

రోడ్ల విస్తరణ పేరుతో రాత్రికి రాత్రే ఆలయాలు కూల్చివేయడం మహాపాపమని అన్నారు. ప్రత్యామ్నయంగా ఆలయాలను ఏర్పాటు చేశాక చర్యలు తీసుకోవాల్సిందని పెద్దిరెడ్డి రాంచంద్రారెడ్డి అభిప్రాయపడ్డారు.
Share this article :

0 comments: