రాజారెడ్డి భౌతికకాయానికి వైఎస్ జగన్ నివాళులు - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » రాజారెడ్డి భౌతికకాయానికి వైఎస్ జగన్ నివాళులు

రాజారెడ్డి భౌతికకాయానికి వైఎస్ జగన్ నివాళులు

Written By news on Saturday, July 2, 2016 | 7/02/2016


నెల్లూరు: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు దబ్బల రాజారెడ్డి (55) భౌతికకాయానికి పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నివాళులర్పించారు. సన్నిహితుడు రాజారెడ్డి అంత్యక్రియల్లో పాల్గొనేందుకు వైఎస్ జగన్ శనివారం సూళ్లురుపేటకు వెళ్లారు. రాజారెడ్డి కుటుంబ సభ్యులను ఆయన ఓదార్చారు. పార్టీ నేతలు మేకపాటి రాజమోహన్ రెడ్డి, మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి, కాకాని గోవర్దన్ రెడ్డి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తదితరులు రాజారెడ్డి భౌతికకాయానికి నివాళులర్పించారు.

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సత్యవేడు నియోజకవర్గ పరిశీలకుడుగా ఉన్న దబ్బల రాజారెడ్డి (55) శుక్రవారం అనారోగ్యంతో ఓ ప్రైవేటు ఆసుపత్రిలో కన్నుమూసిన విషయం తెలిసిందే.
 
Share this article :

0 comments: