నేడు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యవర్గ సమావేశం - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » నేడు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యవర్గ సమావేశం

నేడు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యవర్గ సమావేశం

Written By news on Monday, July 4, 2016 | 7/04/2016

‘గడప గడపకూ వైఎస్సార్’ కార్యక్రమంపై చర్చ

 సాక్షి, హైదరాబాద్ : దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి జయంతి రోజైన ఈ నెల 8 నుంచి రాష్ట్రంలో చేపట్టనున్న ‘గడప గడపకూ వైఎస్సార్’ కార్యక్రమంపై చర్చించడానికి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సోమవారం సమావేశం కానుంది. ఉదయం 10 గంటలకు పార్టీ కేంద్ర కార్యాలయంలో అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అధ్యక్షతన జరగనున్న ఈ సమావేశంలో పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, జిల్లా అధ్యక్షులు, అసెంబ్లీ నియోజకవర్గాల సమన్వయకర్తలు, లోక్‌సభ నియోజకవర్గాల పార్టీ పరిశీలకులు, పీఏసీ, సీజీసీ, సీఈసీ సభ్యులు పాల్గొంటారని పార్టీ వర్గాలు తెలిపాయి. ప్రతిష్టాత్మకంగా చేపట్టనున్న ‘గడప గడపకూ వైఎస్సార్’ కార్యక్రమాన్ని క్షేత్ర స్థాయి వరకూ తీసుకెళ్లే విషయంలో పార్టీ శ్రేణులను సన్నద్ధం చేసే అంశంపై ప్రధానంగా చర్చిస్తారు.
Share this article :

0 comments: