ప్రత్యేక హోదా కోసం ఏ పోరాటానికైనా సిద్ధం - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » ప్రత్యేక హోదా కోసం ఏ పోరాటానికైనా సిద్ధం

ప్రత్యేక హోదా కోసం ఏ పోరాటానికైనా సిద్ధం

Written By news on Friday, July 22, 2016 | 7/22/2016


'ప్రత్యేక హోదా కోసం ఏ పోరాటానికైనా సిద్ధం'
న్యూఢిల్లీ: ప్రత్యేక హోదా బిల్లుకు వైఎస్ఆర్ సీపీ పూర్తి మద్దతు ఇస్తుందని ఆ పార్టీ పార్లమెంటరీ పార్టీ నాయకుడు మేకపాటి రాజమోహన్ రెడ్డి స్పష్టం చేశారు. శుక్రవారం న్యూఢిల్లీలో మేకపాటి రాజమోహన్ రెడ్డి విలేకర్లతో మాట్లాడుతూ... ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు వద్దన్నా కాంగ్రెస్ పార్టీ మాత్రం రాష్ట్రాన్ని విడదీసిందని ఆయన గుర్తు చేశారు.
ప్రత్యేక హోదాపై చిత్తశుద్ధి లేదని టీడీపీపై మేకపాటి మండిపడ్డారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదాపై బీజేపీని ఒప్పించడంలో టీడీపీ విఫలమైందని ఆరోపించారు. ప్రత్యేక హోదా కోసం తమ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి న్యూఢిల్లీలో దీక్షలు చేసి అరెస్ట్ య్యారన్నారు. ప్రత్యేక హోదా కోసం ఏ పోరాటానికైనా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సిద్ధమని మేకపాటి రాజమోహన్ రెడ్డి తెలిపారు.
Share this article :

0 comments: