చంద్రబాబు ఇకనైనా నోరు విప్పాలి: ధర్మాన - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » చంద్రబాబు ఇకనైనా నోరు విప్పాలి: ధర్మాన

చంద్రబాబు ఇకనైనా నోరు విప్పాలి: ధర్మాన

Written By news on Tuesday, July 5, 2016 | 7/05/2016


చంద్రబాబు ఇకనైనా నోరు విప్పాలి: ధర్మాన
హైదరాబాద్ : సదావర్తి సత్రం భూముల వేలాన్ని తక్షణమే రద్దు చేయాలని వైఎస్ఆర్ సీపీ నేత, నిజ నిర్థారణ కమిటీ అధ్యక్షుడు ధర్మాన ప్రసాదరావు డిమాండ్ చేశారు. ఆయన మంగళవారం పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ సదావర్తి భూముల వేలం వ్యవహారంపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇకనైనా నోరు విప్పాలన్నారు.
సదావర్తి భూముల కుంభకోణంపై నివేదికను పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి అందచేసినట్లు తెలిపారు. సదావర్తి భూములపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాలతో భూములు అమ్మకానికి దేవాదాయ శాఖ సిద్ధపడిందన్నారు. అమరావతి, చెన్నై వెళ్లి అధ్యయనం చేసినట్లు చెప్పారు. ఇది రెండు రాష్ట్రాల పరిధిలో రెండు ప్రభుత్వాల మధ్య వ్యవహారం అని, అయితే కేబినెట్, గవర్నర్ దృష్టికి తెలియకుండా ఈ నిర్ణయాలు జరిగాయన్నారు.

హిందువుల ఆస్తుల పరిరక్షణలో చంద్రబాబు ప్రభుత్వం విఫలమైందని ధర్మాన ప్రసాదరావు విమర్శించారు. సదావర్తి భూముల వేలంలో ఈ-టెండర్స్ ఎందుకు పిలవలేదని, హైకోర్టు అనుమతి ఎందుకు తీసుకోలేదని, తమిళనాడు ప్రభుత్వం దృష్టికి ఎందుకు తీసుకు వెళ్లలేదని ధర్మాన సూటిగా ప్రశ్నించారు. రూ.6.50 కోట్ల విలువ ఉన్న భూములను కేవలం రూ.27 లక్షలకే టెండర్లు ఎలా ఖరారు చేస్తారన్నారు. చంద్రబాబు ఈ వ్యవహారంపై ఎందుకు మౌనంగా ఉంటున్నారని, దీనిపై తక్షణమే స్పందించాలని ఆయన డిమాండ్ చేశారు.

సదావర్తి భూములపై వైఎస్ జగన్కు ఇచ్చింది ప్రాథమిక నివేదికే అని, తుది నివేదిక త్వరలో ఇస్తామని ధర్మాన తెలిపారు. తుది నివేదికలో ఈ కుంభకోణానికి డబ్బులు ఎక్కడవి, ఎవరి చేతులు మారాయో అన్నీ బయటకు వస్తాయన్నారు. దీనిపై న్యాయ పోరాటంతో పాటు అసెంబ్లీలో ప్రభుత్వాన్ని నిలదీస్తామన్నారు. అలాగే సదావర్తి భూముల కుంభకోణాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దృష్టికి తీసుకు వెళతామని ఆయన పేర్కొన్నారు. ఇప్పటికైనా చంద్రబాబుకు తప్పును సరిదిద్దుకునే అవకాశం ఉందన్నారు.
Share this article :

0 comments: