వాగ్దానాలు అమలు చేయకపోతే తాట వలుస్తారనే భయం ఉండాలి - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » వాగ్దానాలు అమలు చేయకపోతే తాట వలుస్తారనే భయం ఉండాలి

వాగ్దానాలు అమలు చేయకపోతే తాట వలుస్తారనే భయం ఉండాలి

Written By news on Wednesday, July 13, 2016 | 7/13/2016


ప్రజలు నిలదీస్తారనే భయం పుట్టాలి..
అప్పుడే నాయకులు ఆచితూచి హామీలు ఇస్తారు..
టీడీపీ ప్రజాకంటక పాలనపై చైతన్యం తెచ్చేందుకే గడపగడపకూ వైఎస్సార్
-  ‘పశ్చిమ’లో ప్రజలతో వైఎస్ జగన్

 సాక్షి ప్రతినిధి, ఏలూరు :‘‘ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలు అమలు చేయకపోతే తాట వలుస్తారనే భయం ఉండాలి. అబద్ధాలు చెప్పి మోసం చేస్తే రోడ్డుపైనే నిలదీస్తారనే భయం రాజకీయ నాయకులకు కలగాలి. ఆ మేరకు ప్రజలు చైతన్యవంతం కావాలి’’ అని వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పిలుపునిచ్చారు. అప్పుడే నాయకులు ఆచితూచి హామీలిస్తారన్నారు. లేదంటే చంద్రబాబులాంటి నాయకుడు ప్రతి ఇంటికీ ఒక కారు లేదా విమానమే కొనిస్తాననే వాగ్దానాలు చేస్తాడని ఎద్దేవా చేశారు. పశ్చిమ గోదావరి జిల్లా పర్యటనకు వచ్చిన ఆయన మంగళవారం రాత్రి నల్లజర్ల మండలం పోతవరంలో వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. అనంతరం అక్కడి ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. అమలుకాని హామీలు ఇచ్చి ప్రజలను మోసం చేసిన చంద్రబాబు పాలనపై ప్రజలను చైతన్యవంతులను చేసేందుకే గడపగడపకూ వైఎస్సార్ కార్యక్రమాన్ని చేపట్టినట్టు చెప్పారు.  వంద మార్కులకు వంద ప్రశ్నలు ఇచ్చి చంద్రబాబు హామీలు అమలు చేశాడా లేదా మీరే తేల్చుకోండని ప్రజలకే వదిలేస్తున్నామని చెప్పారు.

 ఉండవల్లికి వైఎస్ జగన్ పరామర్శ సాక్షి, రాజమహేంద్రవరం : మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్‌ను మంగళవారం వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి పరామర్శించారు. ఇటీవల ఉండవల్లి తల్లి లక్ష్మి(99) చనిపోయారు. ఆ సమయంలో అసెంబ్లీ సమావేశాలు ఉండడంతో జగన్ ఫోన్ చేసి పరామర్శించారు. పశ్చిమగోదావరి జిల్లాలో రెండు రోజుల పర్యటన నిమిత్తం ఆయన మంగళవారం మధురపూడి విమానాశ్రయానికి చేరుకున్నారు. అక్కడ నుంచి రాజమహేంద్రవరంలోని ఉండవల్లి నివాసానికి చేరుకుని యోగ క్షేమాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం జగన్ ఉండ్రాజవరం గ్రామానికి చెందిన పార్టీ సీనియర్ నాయకుడు దివంగత బూరుగుపల్లి చిన్నారావు కుటుంబ సభ్యులను పరామర్శించారు.  జగన్ వెంట ఉభయగోదావరి జిల్లాల వైఎస్సార్‌సీపీ అధ్యక్షులు కురసాల కన్నబాబు, ఆళ్లనాని, ఎమ్మెల్సీలు పిల్లి సుభాష్ చంద్రబోస్, మేకా శేషుబాబు, తుని, రంపచోడవరం ఎమ్మెల్యేలు దాడిశెట్టి రాజా, వంతల రాజేశ్వరి, పలువురు మాజీ ఎమ్మెల్యేలు, ఇతర ముఖ్య నేతలు ఉన్నారు.
Share this article :

0 comments: