సింగపూర్ ప్రైవేట్ కంపెనీతో ఒప్పందమేంటి? - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » సింగపూర్ ప్రైవేట్ కంపెనీతో ఒప్పందమేంటి?

సింగపూర్ ప్రైవేట్ కంపెనీతో ఒప్పందమేంటి?

Written By news on Monday, July 18, 2016 | 7/18/2016


సింగపూర్ ప్రైవేట్ కంపెనీతో ఒప్పందమేంటి?
చంద్రబాబు అవినీతికి ఇదే నిదర్శనం: బొత్స సత్యనారాయణ

 ఏలూరు(ఆర్‌ఆర్‌పేట) : రాజధాని నిర్మాణం విషయంలో.. నిబంధనల ప్రకారం సింగపూర్ ప్రభుత్వంతో ఒప్పందం చేసుకోవాల్సి ఉండగా, ఆ దేశానికి చెందిన ప్రైవేటు కంపెనీతో రాష్ట్రప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకోవడమేంటని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత బొత్స సత్యనారాయణ ప్రశ్నించారు. ఇది సీఎం చంద్రబాబు అవినీతికి నిదర్శనమని ధ్వజమెత్తారు. ఆయన ఆదివారం ఏలూరులో విలేకరులతో మాట్లాడుతూ.. రాజధాని నిర్మాణం విషయంలో చంద్రబాబు అనుసరిస్తున్న స్విస్ చాలెంజ్ పద్ధతిని కేంద్రప్రభుత్వం, సుప్రీంకోర్టు తప్పుపట్టినా అదే విధానాలను అనుసరించడం దారుణమన్నారు.

రాష్ట్రంలో అప్రజాస్వామిక, అరాచక పాలన సాగుతోందని, టీడీపీ నాయకులు తమకు నచ్చినరీతిలో దోపిడీ చేస్తున్నారని ధ్వజమెత్తారు. టీడీపీకి చెందిన గ్రామస్థాయి కార్యకర్త నుంచి సీఎం వరకూ ప్రజల్ని దోచుకోవడమే పనిగా పెట్టుకున్నారన్నారు. స్వలాభాలకోసమే పాలన అన్నట్టుగా ఉందన్నారు. రాజధాని నిర్మాణం పేరిట చంద్రబాబు తరతరాలకు సరిపడా ఆస్తులు సంపాదించుకుంటున్నారని విమర్శించారు. చంద్రబాబు అవినీతిపై సీబీఐతోగానీ, సిట్టింగ్ న్యాయమూర్తితోగానీ విచారణ చేయించాలని డిమాండ్ చేశారు. రెండేళ్ల బాబు పాలనలో ప్రజలెదుర్కొంటున్న ఇబ్బందుల్ని తెలుసుకోవడానికే తమ పార్టీ ఆధ్వర్యంలో ‘గడపగడపకూ వైఎస్సార్’ కార్యక్రమాన్ని చేపట్టామని తెలిపారు. ఇందులోభాగంగా చంద్రబాబు అవినీతిపైన, ప్రజాసంక్షేమాన్ని విస్మరించిన వైనంపైన ప్రజల్ని చైతన్యం చేస్తున్నామని వివరించారు.
Share this article :

0 comments: