సాంకేతిక కారణాలు సాకు చూపడం సరికాదు: బుగ్గన - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » సాంకేతిక కారణాలు సాకు చూపడం సరికాదు: బుగ్గన

సాంకేతిక కారణాలు సాకు చూపడం సరికాదు: బుగ్గన

Written By news on Saturday, July 2, 2016 | 7/02/2016


సాంకేతిక కారణాలు సాకు చూపడం సరికాదు: బుగ్గన
హైదరాబాద్ : పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని ఇచ్చిన పిటిషన్ ను స్పీకర్ కోడెల శివప్రసాదరావు తిరస్కరించటం సరికాదని పీఏసీ చైర్మన్ బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి అన్నారు. ఆయన శనివారమిక్కడ మాట్లాడుతూ పిటిషనర్ తో సంబంధం లేకుండా స్పీకర్ నిర్ణయం తీసుకున్నారన్నారు. పార్టీ గుర్తుతో గెలిచిన వాళ్లు వేరే పార్టీలోకి  ఏవిధంగా వెళ్లిపోయారో ఆధారాలు సమర్పించినా, సాంకేతిక కారణాలు సాకుగా చూపడం సరికాదన్నారు.  పిటిషన్ తీవ్రతను స్పీకర్ పరిగణనలోకి తీసుకోలేదని బుగ్గన వ్యాఖ్యానించారు. పిటిషన్ పై నెలలు తరబడి కాలయాపన చేశారని అన్నారు. స్పీకర్ దగ్గర ఇంకా కొన్ని పిటిషన్లు పెండింగ్ లో ఉన్నాయన్నారు. నిష్పక్షపాతంగా నిర్ణయం తీసుకోవాలని ఆయన కోరారు.

ఎమ్మెల్యేల అనర్హత కేసులను గతంలో సుప్రీంకోర్టు విచారణ జరిపిందని, హొలో హొలో కేసు, బాలచందర్ జార్క్, మహాచంద్ర ప్రసాద్ కేసుల్లో నాడు సుప్రీంకోర్టులో వాదనలు జరిగాయని బుగ్గన ఈ సందర్భంగా గుర్తు చేశారు. స్పీకర్ కు పాక్షిక న్యాయాధికారాలు మాత్రమే ఉంటాయని, ఆ కేసుల విచారణ సందర్భంగా ఉన్నత న్యాయస్థానం తెలిపిందన్నారు. (పార్టీ పిరాయించిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేసేలా స్పీకర్‌కి ఆదేశాలు ఇవ్వాలంటూ వైఎస్ఆర్ సీపీ ఎంపీ మేకపాటి రాజమోహన్ రెడ్డి సుప్రీంకోర్టులో పిటిషన్ వేసిన విషయం తెలిసిందే.)
ఆ పిటిషన్ ఈ నెల 8న సుప్రీంకోర్టులో విచారణకు వస్తుందనే భయపడే ఏవో కారణలు చెబుతూ హడావిడిగా స్పీకర్ ఇవాళ పిటిషన్ తిరస్కరించారన్నారు. ఫార్మాట్ తప్పుగా ఉంటే నిర్ణయంపై ఇన్నిరోజుల జాప్యం దేనికని ఆయన సూటిగా ప్రశ్నించారు. స్పీకర్ ఏదైతే ఫార్మాట్ కావాలంటున్నారో అది కూడా సమర్పిస్తామని బుగ్గన తెలిపారు. కాగా పార్టీ మారిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలంటూ  వైఎస్ఆర్ సీపీ ఇచ్చిన పిటిషన్లను శాసనసభ స్పీకర్ కోడెల శివప్రసాదరావు తిరస్కరించిన విషయం తెలిసిందే.
Share this article :

0 comments: