భూపేంద్రసింగ్ కుటుంబానికి వైఎస్ జగన్ పరామర్శ - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » భూపేంద్రసింగ్ కుటుంబానికి వైఎస్ జగన్ పరామర్శ

భూపేంద్రసింగ్ కుటుంబానికి వైఎస్ జగన్ పరామర్శ

Written By news on Monday, July 25, 2016 | 7/25/2016


విశాఖ: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సోమవారం భూపేంద్రసింగ్ కుటుంబసభ్యుల్ని పరామర్శించారు. విశాఖ మర్రిపాలెంలోని 104 ఏరియాలోని ఆయన నివాసానికి విచ్చేసిన వైఎస్ జగన్ ...ఘటనపై కుటుంబసభ్యుల్ని వివరాలు అడిగి తెలుసుకున్నారు. భూపేంద్రసింగ్ కుమారుడితో వైఎస్ జగన్ మాట్లాడి, ధైర్యం చెప్పారు. విమానం కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయని, అధైర్యపడవద్దని సూచించారు.
కాగా అదృశ్యమైన ఏఎన్-32 విమానంలో భూపేంద్రసింగ్ ఎగ్జామినర్ కూడా ఉన్నారు. ఆయనకు భార్య సంగీత, ఇద్దరు కుమారులు ఉన్నారు. వీరి స్వస్థలం ఉత్తరప్రదేశ్. భూపేంద్ర సింగ్ ఆర్మీలో కూడా పనిచేశారు. ప్రమాదం జరిగి నాలుగు రోజులు అయినా తమవారి జాడ తెలీకపోవడంతో కుటుంబసభ్యులు తల్లడిల్లుతున్నారు.

కాగా  ఎన్‌ఏడీ నుంచి ఈ నెల 20వ తేదీన ఎనిమిది మంది ఉద్యోగులు బయలుదేరి వెళ్లారు. 21వ తేదీ ఉదయం 8 గంటలకు చెన్నై చేరుకున్నారు. ఇండియన్ నేవల్ షిప్ (ఐఎన్‌ఎస్) బట్టిమాల్వ్‌లో సీఆర్‌ఎన్-91 అనే ఆయుధంలో తలెత్తిన సమస్యను పరిష్కరించడానికి తమిళనాడు రాజధాని చెన్నైలోని తాంబరం నుంచి అండమాన్ రాజధాని పోర్టుబ్లెయిర్‌కు ఐఏఎఫ్ విమానం ఏఎన్ 32 ఈ నెల 22వ తేదీ ఉదయం 8.30కి బయలుదేరింది. 8.46 గంట లకు ఏటీసీతో సంబంధాలు తెగిపోయాయి.
అనంతరం విమానం అదృశ్యమైనట్లు వైమానిక దళ అధికారులు ప్రకటించారు. విమానంలో 29 మంది ఉండగా వారిలో విశాఖపట్నంలోని నేవల్ ఆర్మమెంట్ డిపో (ఎన్‌ఏడీ)కి చెందిన ఎనిమిది మంది సిబ్బంది ఉన్నారని అధికారులు నిర్ధారించి వారి కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి.
Share this article :

0 comments: