‘స్టాప్‌ ర్యాగింగ్‌’ పోస్టర్ల ఆవిష్కరణ - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » ‘స్టాప్‌ ర్యాగింగ్‌’ పోస్టర్ల ఆవిష్కరణ

‘స్టాప్‌ ర్యాగింగ్‌’ పోస్టర్ల ఆవిష్కరణ

Written By news on Tuesday, July 26, 2016 | 7/26/2016


‘స్టాప్‌ ర్యాగింగ్‌’ పోస్టర్ల ఆవిష్కరణ
కడప కార్పొరేషన్‌:
వైఎస్‌ఆర్‌ స్టూడెంట్‌ యూనియన్‌ ఆధ్వర్యంలో రూపొందించిన ‘స్టాప్‌ ర్యాగింగ్‌’ పోస్టర్లను రాజంపేట ఎంపీ మిథున్‌రెడ్డి, జెడ్పీ చైర్మన్‌ గూడూరు రవి, మైదుకూరు, రాయచోటి, కమలాపురం ఎమ్మెల్యేలు రఘురామిరెడ్డి, గడికోట శ్రీకాంత్‌రెడ్డి, పి. రవీంద్రనాథ్‌రెడ్డి ఆవిష్కరించారు. మంగళవారం ఆర్‌అండ్‌బి అతిథిగృహంలో  నిర్వహించిన కార్యక్రమంలో వారు మాట్లాడుతూ రిషితేశ్వరి లాగా ఏ విద్యార్థినిలు ర్యాగింగ్‌ భూతానికి బలికాకూడదన్నారు. ఆమె తల్లిదండ్రుల గర్భశోకం మరొకరికి కలగకూడదన్నారు.  జిల్లాలోని అన్ని విద్యాసంస్థల్లో ర్యాగింగ్‌ నివారణపై విద్యార్థులకు అవగాహన కల్పించాలన్నారు. ఈ కార్యక్రమంలో జెడ్పీ వైస్‌ చైర్మన్‌ ఇరగం రెడ్డి తిరుపాల్‌రెడ్డి, గల్ఫ్‌ కన్వీనర్‌ బీహెచ్‌ ఇలియాస్,  జెడ్పీటీసీలు సుదర్శన్‌రెడ్డి, సురేష్‌యాదవ్, రైతు విభాగం అధ్యక్షుడు పి.
ప్రసాద్‌రెడ్డి, వైఎస్‌ఆర్‌ఎస్‌యూ జిల్లా అధ్యక్షుడు ఖాజా రహమతుల్లా పాల్గొన్నారు.
Share this article :

0 comments: