రిషితేశ్వరిలా మరొకరు బలికాకూడదు - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » రిషితేశ్వరిలా మరొకరు బలికాకూడదు

రిషితేశ్వరిలా మరొకరు బలికాకూడదు

Written By news on Saturday, July 23, 2016 | 7/23/2016


రిషితేశ్వరిలా మరొకరు బలికాకూడదు
 ‘ర్యాగింగ్ నిరోధించండి’ పోస్టర్‌ను ఆవిష్కరించిన వైఎస్ జగన్

 సాక్షి, హైదరాబాద్ : నాగార్జున యూనివర్శిటీలో ఇంజనీరింగ్ విద్యార్థిని రిషితేశ్వరి ర్యాగింగ్‌కు బలైనట్లు మరొకరు బలికావడానికి వీల్లేదని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి స్పష్టం చేశారు. వైఎస్సార్‌సీపీ రాష్ట్ర విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో రూపొందించిన ‘ర్యాగింగ్ నిరోధించండి’ అనే పోస్టర్‌ను శుక్రవారం పార్టీ కేంద్ర కార్యాలయంలో వైఎస్ జగన్ ఆవిష్కరించారు. ర్యాగింగ్‌ను నిరోధించే విషయమై విస్తృతంగా ప్రచారం చేయాలని విద్యార్థి నాయకులకు ఆయన సూచించారు.

ఈ కార్యక్రమంలో పార్టీ విద్యార్థి విభాగం అధ్యక్షుడు సలాం బాబు, ప్రధాన కార్యదర్శి రాకేష్‌రెడ్డి, కార్యదర్శి కందుల దినేష్‌రెడ్డి, సాయి ప్రతాప్‌రెడ్డి, నదీప్‌రెడ్డి, దివాకర్, యశ్వంత్, గణేష్, శంకర్‌రెడ్డి  పాల్గొన్నారు.
Share this article :

0 comments: