
తిరుపతి: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నీచ రాజకీయాలకు పాల్పడుతున్నారని వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యే రోజా ధ్వజమెత్తారు. విజయవాడలో వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహం తొలగించడం దుర్మార్గమని ఆమె శనివారమిక్కడ అన్నారు. విగ్రహాలు కూల్చినంత మాత్రాన ప్రజల హృదయాల్లో నుంచి వైఎస్ఆర్ ను తొలగించలేరని రోజా వ్యాఖ్యానించారు. ఏపీకి ప్రత్యేక హోదాపై చంద్రబాబు నటిస్తున్నారని ఆమె మండిపడ్డారు. చంద్రబాబు చర్యల వల్లే ప్రత్యేక హోదాకు ముప్పు ఏర్పడిందన్నారు. ఉద్యోగాల్లో మహిళా రిజర్వేషన్లపై ప్రభుత్వం జారీ చేసిన జీవో 40ని రద్దు చేయకుంటే ఉద్యమిస్తామని రోజా హెచ్చరించారు.
0 comments:
Post a Comment