
ఎపి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాజ్యాంగాని కి విరుద్దంగా కేంద్ర ప్రభుత్వాన్ని తప్పుదారి పట్టిస్తూ సింగపూర్ తో ఒప్పందం చేసుకుంటున్నారని వైఎస్ ఆర్ కాంగ్రెస్ నేత గౌతరం రెడ్డి ఆరోపించారు. కేంద్రానికి సంబందించిన విషయంలో ఎపి ప్రభుత్వం ఇంత అవకతవకలు చేస్తుంటే కేంద్రం ఎందుకు పట్టించుకోవడం లేదని ఆయన అన్నారు. కేంద్రం నిద్రపోతోందా అని ఆయన అన్నారు. చంద్రబాబు అడుగులకు కేంద్రం కూడా మడుగులు ఒత్తుతుందా అని ఆయన అన్నారు. స్విస్ చాలెంజ్ పద్దతి ప్రకారం ముందుగా పార్టీతో మాట్లాడరాదని, కాని చంద్రబాబు సింగపూర్ పలుమార్లు సందర్శించారని అన్నారు. సింగపూర్ లో చంద్రబాబు సంపాదించిన సొమ్మును అక్రమంగా ఇక్కడ పెట్టుబడి పెట్టడానికి ప్రయత్నిస్తున్నారని గౌతం రెడ్డి ఆరోపించారు.పారదర్శకత లేకుండా ప్రజా దనాన్ని దుర్వినియోగం చేస్తున్నారని ఆయన అన్నారు.లోకేష్ కు ,మీకు ఉన్న బ్లాక్ మనీని వైట్ చేసుకోవడానికి సింగపూర్ పేరుతో చంద్రబాబు రాజదానిలో స్విస్ చాలెంజ్ పద్దతి అంటున్నారని గౌతం రెడ్డి ఆరోపించారు.
http://kommineni.info/articles/dailyarticles/content_20160726_9.php?p=1469508335397
0 comments:
Post a Comment