పాల్మన్‌పేట బాధితులకు వైఎస్సార్‌సీపీ సాయం - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » పాల్మన్‌పేట బాధితులకు వైఎస్సార్‌సీపీ సాయం

పాల్మన్‌పేట బాధితులకు వైఎస్సార్‌సీపీ సాయం

Written By news on Wednesday, July 27, 2016 | 7/27/2016


పాల్మన్‌పేట బాధితులకు వైఎస్సార్‌సీపీ సాయం
పాయకరావుపేట : విశాఖ జిల్లా పాయకరావుపేట మండలం పాల్మన్‌పేటలో ఇటీవల జరిగిన దాడుల్లో నష్టపోయిన బాధితులకు వైఎస్సార్  కాంగ్రెస్ పార్టీ తరఫున మంగళవారం ఆర్థిక సాయం అందజేశారు. గ్రామంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మొత్తం 109 మంది బాధితులకు రూ.7.75 లక్షల నగదు సాయాన్ని పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తరఫున ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు గుడివాడ అమర్‌నాథ్, ఇతర నేతలు అందజేశారు. ఇందులో 63మందికి రూ.5వేల చొప్పున, 46 మందికి రూ. పదివేలు చొప్పున అందజేశారు.

ఈ సందర్భంగా అమర్‌నాథ్  మాట్లాడుతూ బాధితులను ఆదుకునేందుకు బాధ్యత గల ప్రతిపక్ష నేతగా వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ముందుకొచ్చి తన వంతుగా ఆర్థిక సహాయాన్ని అందించారని చెప్పారు. ప్రతి బాధిత కుటుంబానికి రూ.50 వేలు ఇస్తామని సీఎం చంద్రబాబు ఆర్భాటంగా ప్రకటించినా.. ఇంతవరకు పూర్తి స్థాయిలో ఆదుకోలేదన్నారు. గత నెలలో పాల్మన్‌పేటలో ఒక వర్గం వారిపై ప్రత్యర్థి టీడీపీకి చెందిన వందలాది మూకలు మూకుమ్మడిగా దాడి చేసి భౌతిక దాడులకు పాల్పడటం, ఆస్తుల విధ్వంసానికి తెగబడిన సంగతి తెలిసిందే.
Share this article :

0 comments: