క్షేమంగా ఉంటారని ఆశిద్దాం: మేకపాటి - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » క్షేమంగా ఉంటారని ఆశిద్దాం: మేకపాటి

క్షేమంగా ఉంటారని ఆశిద్దాం: మేకపాటి

Written By news on Tuesday, July 26, 2016 | 7/26/2016


క్షేమంగా ఉంటారని ఆశిద్దాం: మేకపాటి
సాక్షి, న్యూఢిల్లీ : గత శుక్రవారం చెన్నై నుంచి పోర్ట్‌బ్లెయిర్‌కు 29 మందితో వెళుతూ జాడ కానరాకుండా పోయిన వాయుసేన విమానం ఏఎన్-32 ఇంకా సురక్షితంగానే ఉంటుందని, అందులోని సిబ్బంది క్షేమంగానే ఉంటారని ఆకాంక్షిద్దామని వైఎస్సార్ కాంగ్రెస్ పార్లమెంటరీ పక్షనేత, ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి కోరారు. విమానం గల్లంతుపై పూర్తి వివరాలు తెలుసుకోవడానికి పార్టీ ఎంపీల బృందం సోమవారం కేంద్ర రక్షణ మంత్రి మనోహర్ పరీకర్‌తో సమావేశమైంది. అనంతరం సమావేశ వివరాలను ఎంపీలు వైవీ సుబ్బారెడ్డి, విజయసాయిరెడ్డి, బుట్టారేణుక, వైఎస్ అవినాష్‌రెడ్డితో కలసి మేకపాటి మీడియాకు వెల్లడించారు.   

 వాయిదా తీర్మానానికి నోటీసులిచ్చాం:  వైవీ సుబ్బారెడ్డి
 విమానం గల్లంతుపై లోక్‌సభలో వైఎస్సార్‌సీపీ తరఫున వాయిదా తీర్మానం ఇచ్చినట్లు ఎంపీ వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. ఇదే అంశంపై ఇతర పార్టీలూ నోటీసులు ఇవ్వడంతో ఈ విషయమై మాట్లాడడానికి స్పీకర్ ఒక్కరికే అవకాశం కల్పించారని.. దీంతో కాంగ్రెస్ పక్షనేత ఖర్గే ప్రసంగించారని ఆయన వివరించారు. ఖర్గే మాట్లాడుతున్న సందర్భంలో తమ పార్టీ ఎంపీలు కూడా లేచి నిలబడి భాగస్వాములైనట్లు తెలిపారు.
Share this article :

0 comments: