ఇంకా ఎంతకాలం మోసం చేస్తారు? - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » ఇంకా ఎంతకాలం మోసం చేస్తారు?

ఇంకా ఎంతకాలం మోసం చేస్తారు?

Written By news on Monday, August 1, 2016 | 8/01/2016


ఇంకెంత కాలం మోసం చేస్తారు బాబూ!
వైఎస్సార్‌సీపీ పీఏసీ సభ్యుడు అంబటి రాంబాబు మండిపాటు
సాక్షి, హైదరాబాద్: ప్రత్యేక హోదా విషయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు రాష్ట్ర ప్రజలను ఇంకా ఎంతకాలం మోసం చేస్తారు? అని వైఎస్సార్‌సీపీ పీఏసీ సభ్యుడు అంబటి రాంబాబు ధ్వజమెత్తారు. ఆయన ఆదివారం పార్టీ కేంద్ర కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వబోమని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ రాజ్యసభలో కుండబద్ధలు కొట్టిన తరువాత తామేదో గట్టిగా పోరాడుతామన్నట్లుగా చంద్రబాబు ప్రజల్లో భ్రమలు కల్పిస్తున్నారని విమర్శించారు.

ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి రెండేళ్లుగా రాష్ట్రమంతటా పర్యటించి ప్రత్యేక హోదా వల్ల కలిగే ప్రయోజనాలను ప్రజలకు తెలియజెప్పి ఉద్యమ రూపంలోకి తెచ్చాకే ఇప్పుడు చంద్రబాబులో కొంత మార్పు వచ్చిందన్నారు. ఇందుకు తాము సంతోషిస్తున్నామని అన్నారు. కాగా కేవలం రాజకీయ కక్షతోనే విజయవాడలో వైఎస్ విగ్రహాన్ని తొలగించారని, దీనికి వెయ్యి రెట్లు మూల్యం చెల్లించడానికి చంద్రబాబు సిద్ధంగా ఉండాలని చెప్పారు.
Share this article :

0 comments: