ఎవరి చెవిలో పూలు పెడుతున్నారు - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » ఎవరి చెవిలో పూలు పెడుతున్నారు

ఎవరి చెవిలో పూలు పెడుతున్నారు

Written By news on Wednesday, August 31, 2016 | 8/31/2016


‘ఎవరి చెవిలో పూలు పెడుతున్నారు’
హైదరాబాద్: ఓటుకు కోట్లు కేసుపై తెలంగాణ ప్రభుత్వం చిత్తశుద్ధితో దర్యాప్తు జరిపించాలని వైఎస్సార్ సీపీ నాయకుడు బొత్స సత్యనారాయణ డిమాండ్ చేశారు. చంద్రబాబుతో లాలుచి పడకుండా విచారణ చేయించాలని అన్నారు. పార్టీ కేంద్ర కార్యాలయంలో బుధవారం మధ్యాహ్నం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఈ కేసును నీరు గార్చేందుకు చంద్రబాబు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. సాంకేతిక అంశాలను అడ్డుపెట్టుకుని కేసు నుంచి తప్పించుకునేందుకు చంద్రబాబు చూస్తున్నారని అన్నారు. కేంద్ర మంత్రి సుజనా చౌదరి హుటాహుటిన హైదరాబాద్ వచ్చి గవర్నర్ ను కలవడంలోని ఆంతర్యం ఏమిటని ఆయన ప్రశ్నించారు.

ఆయన ఇంకా ఏమన్నారంటే..
 • ఓటుకు కోటు కేసులో నెల రోజుల్లో విచారణ జరపాలని కోర్టు ఆదేశించింది. అస్సలు ఈ కేసు నిలవదని టీడీపీ నేతలు చెప్తుతున్నారు
 • అదే సందర్భంలో ఢిల్లీలో బీజేపీ అధ్యక్షుడితో సుజనా చౌదరి భేటీ అయ్యారు
 • వెంకయ్య నాయుడు, అరుణ్ జైట్లీ కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు.
 • ఈ ఉదయం సుజనా చౌదరి హుటాహుటిన హైదరాబాద్ వచ్చారు
 • గవర్నర్ తో హడావుడిగా సమావేశమయ్యారు
 • ప్రత్యేక హోదా గురించి మాట్లాడానని సుజనా చెబుతున్నారు
 • ప్రత్యేక హోదా రాజ్యాంగపరమైన అంశమా?
 • ఎవరి చెవిలో పూలు పెడుతున్నారు?
 • రాజ్ భవన్ అను వ్యవస్థను... వ్యవస్థలానే ఉంచాలని కోరుతున్నాం
 • రాజ్ భవన్ గౌరవాన్ని దెబ్బతీయొద్దని కోరుతున్నాం
 • రాజ్ భవన్ ను రాజీభవనంగా, లాలుచిభవనంగాచేయొద్దని విజ్ఞప్తి చేస్తున్నాం
 • గవర్నర్ కు తెలంగాణ సీఎం ఏసీబీ డీజీ, అడ్వకేట్ జనరల్ బ్రీఫ్ చేస్తారు
 • పరిపాలనలో భాగంగా వారు బ్రీఫ్ చేసివుండొచ్చు
 • బీజేపీ అధ్యక్షుడితో జరిగిన భేటీలో ప్రత్యేక హోదా అంశాన్ని చర్చిస్తే దాన్ని ప్రధానికి నివేదించాలి గానీ, గవర్నర్ కు చెప్తారా?
 • ఓటుకు కోట్లు కేసులో బీజేపీ మధ్యవర్తిత్వం వహిస్తోందని చెప్పదలిచారా?
 • చట్టాన్ని చేతుల్లోకి తీసుకుని రాజ్యాంగానికి అతీతులమని చెప్పాలనుకుంటున్నారా?
 • రాజ్యాంగాన్ని కాపాడాల్సిన కేంద్రం, రాజ్ భవన్ ఇలాంటి కార్యక్రమాలకు వేదిక కావడం సమంజసమా?
 • కేసుల నుంచి బయటపడేందుకు చంద్రబాబు రాష్ట్ర ప్రయోజనాలకు తాకట్టు పెట్టారని మొదట నుంచీ చెప్తున్నాం
 • చంద్రబాబును ఎవరూ కాపాడలేరని చెప్పిన తెలంగాణ సీఎం ఎందుకు ముందుకు కదల్లేకపోతున్నారు?
 • మొదటి చార్జిషీటులో చంద్రబాబు పేరు ఉన్నా ఆయనను ఎందుకు విచారించలేదు?
 • సామాన్యులకు ఒక న్యాయం, సీఎంకు మరో న్యాయమా?
 • రాజ్​ భవన్ లో ఏం జరిగిందో అధికారిక ప్రకటన ద్వారా ప్రజలకు తెలియాల్సిన అవసరముంది
 • టెక్నికల్ అంశాలను అడ్డుపెట్టుకోవడం చంద్రబాబుకు అలవాటు
 • అన్నిరోజులు మీవి కావని టీడీపీ నాయకులు, చంద్రబాబు గుర్తించాలి
 • ఓటుకు కోట్లు కేసులో దర్యాప్తుపై తెలంగాణ ప్రభుత్వం చిత్తశుద్ధిని ప్రదర్శించాలి
Share this article :

0 comments: