నయీంను పెంచి పోషించింది టీడీపీనే - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » నయీంను పెంచి పోషించింది టీడీపీనే

నయీంను పెంచి పోషించింది టీడీపీనే

Written By news on Thursday, August 11, 2016 | 8/11/2016


'నయీంను పెంచి పోషించింది టీడీపీనే'
హైదరాబాద్ : గ్యాంగ్ స్టర్ నయీంను పెంచి పోషించింది టీడీపీనే అని అర్థమవుతోందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి పార్థసారధి అన్నారు. ఆయన గురువారం పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ నయీం లింకులన్నింటినీ ప్రజల ముందుంచాలన్నారు. నయీంను పెంచి పోషించింది చంద్రబాబు, టీడీపీ నాయకులేనన్న ఆధారాలు వెలువడడం చూస్తే...అధికారం కోసం టీడీపీ  ఎటువంటి అడ్డదారులైనా తొక్కుతుందని తెలుస్తోందని  మండిపడ్డారు. రాబోయే రోజుల్లో ఏపీలో చంద్రబాబు ప్రభుత్వం ఎంతమంది నయీంలను పెంచిపోషిస్తుందోనన్న భయాందోళనలు కలుగుతున్నాయని అన్నారు.

ప్రత్యేక హోదాపై ముఖ్యమంత్రులు, మంత్రులు, ఎంపీలు తలో మాట మాట్లాడుతూ ప్రజలను గందరగోళానికి చేస్తున్నారని ఆయన అన్నారు. ప్రత్యేక హోదాపై ఢిల్లీలో ఒకమాట...ఇక్కడ ఒకమాట మాట్లాడుతున్నారని పార్థసారధి వ్యాఖ్యానించారు. వైఎస్ జగన్ హోదాను సాధిస్తారన్న భయంతోనే లోకేష్ హోదాను తక్కువ చేసి చూపించేందుకు తాపత్రయపడుతున్నారని ధ్వజమెత్తారు.  హోదాపై టీడీపీ ద్వంద్వ వైఖరి అవలంబిస్తోందని ఆయన  విమర్శించారు.  బాబు ఢిల్లీకి 30సార్లు వెళ్లానని చెబుతున్నారని, ఆయన ఏపీకి ఏం సాధించి పెట్టారని ఎద్దేవా చేశారు. ప్రత్యేక హోదా వల్లే ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి సాధ్యం అవుతుందన్నారు.
Share this article :

0 comments: