గుంటూరు జిల్లాలో ఉద్రిక్తత - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » గుంటూరు జిల్లాలో ఉద్రిక్తత

గుంటూరు జిల్లాలో ఉద్రిక్తత

Written By news on Monday, August 29, 2016 | 8/29/2016


దాచేపల్లి(గుంటూరు): కృష్ణా పుష్కర పనుల్లో అవినీతి జరిగిందని ఒకరు.. నిరూపిస్తే రాజీనామాకు సిద్ధమని మరొకరు.. సవాల్‌కు ప్రతిసవాల్ విసురుకోవడంతో.. గుంటూరు జిల్లాలో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. గురజాల ఎమ్మెల్యే యరపతినేని పై మాచర్ల వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి అవినీతి ఆరోపణలు చేశారు. ఇద్దరి మధ్య ఈ విషయంలో వాదోపవాదాల అనంతరం ఆధారాలతో నిరూపిస్తే.. రాజీనామా చేస్తానని యరపతినేని సవాల్ చేశారు.

దీంతో అవినీతికి సంబంధించిన ఆధారాలతో వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి దాచేపల్లిలో జరిగే చర్చావేదికకు వెళ్లడానికి సిద్ధమవుతుండగా.. సోమవారం ఉదయం పోలీసులు ఆయనను గృహనిర్బంధం చేశారు. అలాగే.. గురజాల ఎమ్మెల్యేను సైతం పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. ఈ నేపథ్యంలో పల్నాడు పరిధిలోని మాచర్ల, గురజాల, దాచేపల్లిలో రాత్రి నుంచి 144 సెక్షన్ అమలు చేస్తున్నారు. ముందస్తు చర్యలో భాగంగా మాచర్లలోని ఎమ్మెల్యే పిన్నెల్లి ఇంటి ఎదుట భారీగా పోలీసులను మొహరించారు. చర్చావేదికకు వెళ్లేందుకు యత్నిస్తున్న పిడుగురాళ్ల, మాచర్ల, దాచేపల్లికి చెందిన వైసీపీ నేతలను పోలీసులు అదుపులోకి తీసుకుంటున్నారు.
Share this article :

0 comments: