‘గోవధ అపోహ’ బాధితులకు వైఎస్ జగన్ పరామర్శ - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » ‘గోవధ అపోహ’ బాధితులకు వైఎస్ జగన్ పరామర్శ

‘గోవధ అపోహ’ బాధితులకు వైఎస్ జగన్ పరామర్శ

Written By news on Friday, August 12, 2016 | 8/12/2016


‘గోవధ అపోహ’ బాధితులకు వైఎస్ జగన్ పరామర్శ
అమలాపురం: ‘గోవధ అపోహ’ బాధితులను వైఎస్సార్‌ సీపీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పరామర్శించారు. తూర్పుగోదావరి జిల్లా అమలాపురం ప్రభుత్వాస్పత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను శుక్రవారం మధ్యాహ్నం కలుసుకుని ఘటన పూర్వాపర్వాలు అడిగి తెలుసుకున్నారు. బాధితులకు అండగా ఉంటామని భరోసాయిచ్చారు.

ఉప్పలగుప్తం మండలం సూదాపాలెంలో గోవధకు పాల్పడ్డారన్న అపోహతో ఇటీవల ఇద్దరు దళితులపై దుండగులు అమానుషంగా దాడి చేసిన ఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ ఘటనలో అమలాపురం పట్టణంలోని జానకిపేటకు మోకాటి ఎలీషా, అతని సోదరుడు మోకాటి వెంకటేశ్వరరావు, డ్రైవర్ లక్ష్మణకుమార్ తీవ్రంగా గాయపడ్డారు.
Share this article :

0 comments: