వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్‌రెడ్డి మండిపాటు
ప్రత్యేక హోదా కోసం కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి పెంచాల్సిన ముఖ్యమంత్రి చంద్రబాబు ఢిల్లీకి వెళ్లి, కృష్ణా పుష్కరాలను తానే తీసుకొస్తున్నట్లు అందరినీ ఆహ్వానిస్తూ ప్రచారం చేసుకుంటున్నారని వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్‌రెడ్డి ధ్వజమెత్తారు. దీన్నిబట్టి చంద్రబాబుకు ప్రచార యావ ఏ స్థాయిలో ఉందో ఇట్టే అర్ధమవుతోందని విమర్శించారు. శ్రీకాంత్‌రెడ్డి శుక్రవారం పార్టీ కేంద్ర కార్యాలయంలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు.
ప్రచార పిచ్చితో గోదావరి పుష్కరాలలో 30 మందిని పొట్టనపెట్టుకున్న చంద్రబాబు ఇప్పుడు కృష్ణా పుష్కరాలలో కూడా తన ప్రచారాన్ని ప్రారంభించారని దుయ్యబట్టారు. గుడుల కూల్చివేత, పుష్కరాలలో దోపిడీపై ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. చంద్రబాబు 23 సార్లు ఢిల్లీకి వెళ్లి ఏం సాధించారో చెప్పాలని అన్నారు.

0 comments:
Post a Comment