బంగాళాఖాతంలో కలిపేస్తారనే... - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » బంగాళాఖాతంలో కలిపేస్తారనే...

బంగాళాఖాతంలో కలిపేస్తారనే...

Written By news on Tuesday, August 2, 2016 | 8/02/2016


బంగాళాఖాతంలో కలిపేస్తారనే..
‘హోదా’పై చంద్రబాబు వ్యాఖ్యలపై మేకపాటి ధ్వజం
ప్రజాగ్రహం వెల్లువెత్తుతుండటంతో డ్రామాలు
ఇంకా కేంద్ర ప్రభుత్వంలోనే కొనసాగుతామనడం సిగ్గు చేటు
హోదా సాధించే వరకూ పోరాడతాం: వైవీ సుబ్బారెడ్డి

సాక్షి, న్యూఢిల్లీ: విభజన చట్టంలోని హామీ అయిన ప్రత్యేక హోదాను ఏపీకి ఇవ్వలేమని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసిన తరుణంలో.. రాష్ట్ర ప్రజలు టీడీపీని, బీజేపీని బంగాళాఖాతంలో కలిపేస్తారన్న విషయం తెలుసుకునే చంద్రబాబు ఇప్పుడు ప్రత్యేక హోదాపై మాట మారుస్తున్నారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ నేత మేక పాటి రాజమోహన్ రెడ్డి మండిపడ్డారు.

వైఎస్సార్ సీపీ ఎంపీలు వైవీ సుబ్బారెడ్డి, వరప్రసాదరావు, బుట్టారేణుకలతో కలసి ఆయన సోమవారం ఢిల్లీలో విలేకరులతో మాట్లాడారు. గత శుక్రవారం రాజ్యసభలో ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వలేమని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ స్పష్టంగా చెప్పడం వల్ల.. ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత వెల్లువెత్తుతుండడంతో చంద్రబాబు ఇప్పుడు డ్రామాలు అడుతున్నారని విమర్శించారు. ఎన్నికల ముందు 15 ఏళ్లపాటు హోదా కావాలని డిమాండ్ చేసిన చంద్రబాబు.. ఆ తరువాత హోదా సంజీవని కాదు అన్ని మాటమార్చారని గుర్తుచేశారు.

హోదా ఉన్న రాష్ట్రాలు అభివృద్ధి చెందాయా అని ప్రశ్నించడం రాష్ట్రాభివృద్ధిపై చంద్రబాబు చిత్తశుద్ధిలేని తనానికి నిదర్శనమన్నారు. హోదా ఇవ్వలేమని కేంద్రం స్పష్టం చేసినా.. కేంద్ర ప్రభుత్వంలోనే కొనసాగుతామని చెప్పడం సిగ్గుచేటని ఆయన దుయ్యబట్టారు. యూపీ ఎన్నికల్లో బీజేపీ ఓడిపోతే... కేంద్రానికి మద్దతు ఇవ్వడం పెద్ద తప్పిదమంటూ చంద్రబాబు చెప్పినా చెబుతారని ఎద్దేవా చేశారు.

రాష్ట్రానికి ప్రత్యేకహోదా తప్పకుండా ఇవ్వాలన్నారు. పార్లమెంటులో చెప్పిన దానికే దిక్కు లేకుంటే.. ఇక పార్లమెంటరీ వ్యవస్థ మీద ప్రజలు ఎలా నమ్మకం కలుగుతుందని మేకపాటి ప్రశ్నించారు. మోదీ ప్రభుత్వం కూడా ఏపీకి ఇచ్చిన హామీల అమలు విషయంలో చిత్తశుద్ధి లేకుండా వ్యవహరిస్తోందని ఆయన విమర్శించారు.
 
పోరాడుతూనే ఉంటాం: ఎంపీ వైవీ
ప్రత్యేక హోదా కోసం గత రెండున్నరేళ్లుగా వైఎస్సార్‌సీపీ పోరాడుతూనే ఉందని, హోదా సాధించేవరకు పోరాడుతామని ఎంపీ వైవీ సుబ్బారెడ్డి చెప్పారు. తమ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి హోదా కోసం ఎని మిది రోజులపాటు దీక్ష చేశార ని గుర్తు చేశారు. తాము ప్రవేశపెట్టి ప్రైవేటు బిల్లుపై రాష్ట్రపతి నిర్ణయం తీసుకోవాల్సి ఉందన్నారు. టీడీపీ కేంద్రం నుంచి బయటకు వచ్చి ప్రత్యేక హోదా ఇచ్చేవరకు పోరాడాలని ఎంపీలు వరప్రసాద్, బుట్టారేణుక డిమాండ్ చేశారు.
Share this article :

0 comments: